-సీసీ రోడ్లు, రెండు పడక గదుల, అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంకుస్థాపన
-చివ్వెంలలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న పీహెచ్‌సీకి శంకుస్థాపన
-ఏపూర్‌లో నీటి నివారణ కోసం శాశ్వత చర్యలు
-రూ 8 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
సూర్యాపేటప్రతినిధి, మేజర్‌న్యూస్: నియోజకవర్గంలో పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు గాను రూ.5 కోట్ల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టనున్నట్లు రాష్టవ్రిద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం టేకుమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.27.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, గాంధీనగర్‌లో మూడెకరాల స్థలంలో నిర్మించనున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి , అదే విధంగా గాంధీనగర్ నుంచి బురప్రిట్టతండా మీదుగా ఆంబోతు తండా వరకు రూ.190 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, గాంధీనగర్‌లో రూ.6.50 లక్షల వ్యయం తో నిర్మించిన అదనపు తరగతి గదుల పాఠశాలను, షాదీఖానాను మంత్రి ప్రారంభించారు. అనంతరం చివ్వెంల మండలంలో రూ.2 కోట్ల రూపాయం వ్యయంతో నిర్మించనన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఆత్మ కూర్.ఎస్‌మండలంలోని ఏపూర్‌గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ ంతో పాటు రూ.8 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు , గాంధీనగర్, వల్లభాపురం గ్రామాల్లోని ప్రభుత్వ నర్సరీల పరిశీలన, చీదెళ్ల గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ప్రతి శుక్రవారం అధికారులు, ప్రజలు గ్రీన్‌డే పాటించి నాటిన మొక్కలను సంరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు.33 శాతం మేర ఉండాల్సిన అడవులు అంతరించిపోవడం వలన ప్రజలు ఎండ తీవ్రతను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన రాష్ట్ర సీఎం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణను హరితతెలంగాణ మార్చేందుకు విరివిగా మొక్కలు నాటుతున్నారని చెప్పారు. కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు సహఖరించి సూర్యాపేటను రాష్టస్థ్రాయిలో ముందుంచడంతో పాటు హరిత సూర్యాపేటగా మార్చాలని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇళ్ల ప్రభుత్వం మంజూరు చేస్తే మొట్టమొదటిగామన నియోజకవర్గంలోని శంకుస్థాన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, కసగాని లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa