-వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు వరప్రధాయిని
-వచ్చే జోన్ నాటికి పూర్తి అందుబాటులోకి
-నిర్మాణంలో కాలువలు, స్ట్రక్చర్‌లు, గేట్ వాల్వులు
-నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం
మేజర్‌న్యూస్, తెలంగాణ ప్రతినిధి: నాలుగు లక్షల ఎకరాలు ఆయకట్టే లక్ష్యంగా ఎస్సారెస్సీ స్టేజ్-2 పనులు జరుగుతున్నాయి. సుమారు దశాబ్ధన్నర కాలంగా జరుగుతున్న ఈ పనులు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో సగం సస్య శ్యామలంగా మారబోతున్నది. నిత్యం కరువును ఎదుర్కొనే జిల్లాలయిన వరం గల్ రూరల్, మహాబూబాబాద్, జనగామ జిల్లాలు పాడి పంటలతో వర్ధిల్లబో తున్నాయి, ఈ కాలువ పొడవు 62 కి.మీ. శ్రీరాంసాగర్ ప్రాజెక్‌టల్లో 284 కి.మీ వద్ద ప్రారంభమై 345 కి.మీల వద్ద ఉమ్మడి జిల్లాలో పూర్తి అవుతున్నది. రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులలో ప్రారంభమై సూర్యాపేట జిల్లా తిర్మల గిరి మండలంలో కలిసి పూర్తి అవుతున్నది. ఈ ప్రాజెక్‌ట ప్రస్తుత ఆయకట్టు 3లక్షల 97వేల 949 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. ఈ ప్రాజెక్‌టలో 14 డిబీఎం లు కలిగిఉన్నాయి. వీటిలో డిబీఎంల వారిగా చూస్తే 55, 56, 57, 59, 60, 61, 63, 65, 67, 69, 70, 71 మరియు టెయిల్ ఎండ్ డిస్ట్రిబ్యూటరీ కలిగిఉంది. డిస్ట్రిబ్యూటర్లు కవర్ అయ్యే ప్రాంతాల వారీగా చూస్తే డీబియం 54,55,56,57లు రాయపర్తి మండలం, డీబిఎం 59,60, తొర్రూర్ మండలం డీబిఎం 61,63 పెద్దవంగర మండలం, డీబీఎం 65,67 కొడకండ్ల మండలం, డీబీఎం 69,70,71లు తిర్మలగిరి మండల ప్రాంతాలను కలిగి ఉన్నాయి.
ప్రస్తుత సాగు ఆయకట్టు :
ఈ ప్రాజెక్టులోని 14 డీబీఎంల ద్వారా ప్రస్తుతం 3,97,961 ఎకరాలు సాగవుతున్నది. డీబీఎంల వారీగా ఆయకట్టు వివరాల్లోకి వెళ్తే డీబీఎం 54లో 14వేల 828 ఎకరాలు, డీబీఎం 55లో 618 ఎకరాలు, డీబీఎం 56లో 497 ఎకరాలు, డీబీఎం 57లో 10 వేల 180 ఎకరాలు, డీబీఎం 59లో 10వేల 870 ఎకరాలు, డీబీఎం 60లో లక్షా 31వేల 981 ఎకరాలు, డీబీఎం 61లో 3,841 ఎకరాలు, డీబీఎం 63లో 3,467 ఎకరాలు, డీబీఎం 65లో 905 ఎకరాలు, డీబీఎం 67లో 205 ఎకరాలు, డీబీఎం 69లో 67వేల 956 ఎకరాలు, డీబీఎం 70లో 7వేల 173 ఎకరాలు, డీబీఎం 71లో లక్షా 44వేల 230 ఎకరాలు, టేల్ ఎండ్‌లో1200 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. దీనిలో అత్యదికంగా ఉమ్మడి జిల్లాలో చూస్తే తొర్రూరు మండలంలో అత్యదికస్థాయిలో లక్ష్యా 3వేల 981 ఎకరాల భూమి సేద్యంలోకి రావడం మదావాహం, అత్యల్ప స్థాయిలో కొడకండ్లమండలంలో డీబీఎం 67 ద్వారా కేవలం 205 ఎకరాలు సేద్య మవుతున్నది.
పూర్తికానున్న భూసేకరణ, పిల్లకాలువలు:
దశాబ్ధన్నర పూర్తి కావొస్తున్న ఈ స్రాజెక్టుకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు గైనకొన
డంతో భూసేకరణ వేగం పుంజుకున్నది. ఈ ప్రాజెక్‌ట పూర్తికి ఇప్పటికి 19వేల 952 ఎకరాల భూమి ని సేకరించారు. ఇంకా అదనంగా మరో 594 ఎకరాల భూమిని సేకరిం చాల్సింది. ఈ సేకరణకై స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు నిత్యం ఒత్తిడి తెస్తుండటంతో ఇది స్పీడందుకొంది. ఇప్పటి కే ప్రధాన కాలువ పూర్తయ్యింది. ఉపకాలువలు, పిల్ల కాలువలు వచ్చేజొన్ ఆఖరు నాటికి పూర్తి కాబోతున్నట్లు సమాచారం. ఇవి పూర్తయితే మరో వేలాది ఎకరాలు భూమి సాగులోకి రాబోతున్నది. ఈ ప్రాజెక్టు పరిధిలో రాయపర్తి మండలం మైలారం, కొడకండ్ల మండలంలో బయ్యారం రిజర్వాయర్లుగా నిర్మితమై సమీప ప్రాంతాలలో వేలాది ఎకరాలకు సాగునీరును అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడు తున్నది. వచ్చే జూన్ ఆఖర్లోగా పూర్తయే కాలువల తవ్వకం, స్ట్రక్టర్లతో అదనంగా మరో లక్షా 26వేల 823 ఎకరాలు సేద్యంలోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు భూసేకరణలో క్లిష్టతరంగా మారిన ప్రాంతాలలో సేకరణ చేపట్టారు. మహబూ బాబాద్ జిల్లాలోని దంతాలపెల్లి, మరిపెడ, నర్సింహులపేట మండలాల్లో 354 ఎకరాల భూసేకరణ వచ్చే సంక్రాంతిలోగా పూర్తి చేయనున్నారు.
సేద్యపునీటి సరాఫరాలో కృషి చేస్తున్నాము.
ఎస్పారెస్పీ2 ఎస్. ఈ వెంకటేశ్వర్‌రావు
వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలలో లక్షలాది ఎకరాల వ్యవసాయ సాగుకు నీరందించేందుకు విశేషకృషి జరుపుతున్నాము. ప్రాజెక్‌ట పూర్తికి ఎదురయ్యే ఆటంకాలను తొలగించి పూర్తయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. మరోవైపు ఎల్.ఎమ్.డిలో వృదాగాపోతున్న వరదనీటిని ఈ ప్రాజెక్‌ట ద్వారా సుమారు 6 టీఎంసీల నీటిని రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలోని 150 చుఱువులకు మిల్లించి, ఆ చెరువులను నింపాం, వీటి ద్వారా సుమారు 30వేల ఎకరాల భూమికి సాగుకు నీరందించాము.
రైతులు నీటి విలువను గుర్తించి నీటిని జాగ్రత్తగా సద్విని యోగం చేసు కోవాలి. ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇచ్చి మెట్ట పంటలు పండిచాలన్నారు. బిందుసేద్యాన్ని, తుంపరసేద్యాన్ని ఎక్కువగా చేయాలని రైతులకు ఎస్, ఈ వెంకటేశ్వర్‌రావు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa