యాసంగి దిగుబడిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి
మిషన్ కాకతీయ మూడో దశ పనులపై
సమీక్ష కలెక్టర్లను ఆదేశించిన స్పెషల్ సీఎస్ ఎస్.కె.జోషి
హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధి: యాసంగి పంట దిగుబడి మరికొద్ది రోజుల్లో చేతికందనున్న దృష్టా్య సాగునీటి యాజ మాన్యం సమర్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ల ను టి.ఎస్. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషి ఆదేశిం చారు. శుక్రవారం సెక్రటేరియట్ సి బ్లాక్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మిషన్ కాకతీయ 1,2 లతో పాటు మిషన్ కాకతీయ - 3 కింద చేపట్టనున్న పనులను కూడా జోషి సమీక్షించారు. అలాగే భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. నాగార్జునసాగర్ , నిజాంసాగర్, సింగూరు, ఎస్‌ఆర్‌ఎస్పి తదితర ప్రాజక్టులు ఇతర మీడియం ప్రాజెక్టుల నుంచి సాగునీటి సరఫ రాను క్రమబద్దీకరించి, యాసంగి దిగుబడి కి నష్టం వాటిల్ల కుండా ప్రతిరోజూ ఇరిగేషన్, రెవిన్యూ, వ్యవసాయ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని సమీక్షించాలని జిల్లా లెక్టర్లను ప్రభుత్వం కోరింది. గ్యాప్ ఆయకట్టును పూడ్చడానికి గాను కేంద్ర ప్రభుత్వం పధకం కింద నిధులిస్తున్నందున వివిధ భారీ, మధ్యతరహా ప్రాజెక్టులలో ఉన్న గ్యాప్ ఆయకట్టును పూర్తి చేయడానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే పంపిం చాలని జోషి కోరారు. 'కాడా ' కమిషనర్ డాక్టర్ మల్సూర్ ఈ మేరకు వీడియో కాన్పరెన్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, సాగునీటి నిర్వహణ (క్యాడ్ వామ్) కోసం కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకోవాలని స్పెషల్ సి.ఎస్ సూచించారు. కింద ప్రతిపాదనలు ఇరిగేషన్ అధికారులు ఈనెల 20లోగా ప్రభుత్వానికి పంపించేలా జిల్లా కలక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పెషల్ సి. ఎస్ ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుందని తెలి పారు. ఆయకట్టు లోకలైజేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాల వారీగా ఈ ప్రక్రియను ముగించాలన్నారు. గతంలో పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టును రీ లోకలైజ్ చేయాలని కోరారు.మిషన్ కాకతీయ - 2 పనులన్నింటినీ జూన్ చివరికల్లా పూర్తి చేయాలని ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఎం.కె - 2 పనులు ఈనెల 13వ తేదీలోగా గ్రౌ డ్ చేయాలని, గ్రౌండ్ కాని పనుల ఏజెన్సీలను రద్దు చేయాలని జోషి ఆదేశిం చారు. సాగునీటి రంగంలో కాల్వల పూడికతీత, కాలువల్లో ని శిధిలాల తొలగింపు తదితర కార్యక్రమాల కోసం గత ఏడాది రూ.137 కోట్లు ఖర్చు పెట్టినట్టు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల కమిషనర్ నీతూప్రసాద్ తెలిపారు. ఈ యేడాది 207 కోట్లు ఖర్చు చేయవచ్చునని ఆమె చెప్పారు. తొలగించిన పూడిక, ఇతర శిధిలాల రవాణాకు 5 కిలోమీటర్ల వరకు రవాణా ఛార్జీలు కూడా పరిధిలో చెల్లింపులు చేస్తామని ఆమె అన్నారు. కింద చేపట్టవలసిన పనుల అంచనాలు, ప్రతిపాదనలతో మండలాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా కలక్టర్లు , ఇరిగేషన్ అధికారులను కోరారు. వీడియో కాన్ఫరెన్సులో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఇఎన్ సి మురళీధరరావు , కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, వివిధ జిల్లాల కలెక్టర్లు , సిఇలు మధుసూదనరావు, లింగరాజు, శాంసుందర్, శంకర్, బి.వెంకటేశ్వర్లు, సురేశ్, ఓఎస్ డి శ్రీధర్ రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa