ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెస్‌ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచాలని విద్యార్థుల భారీ ధర్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2017, 12:49 AM

 -పెరిగిన…  ధరలకనుగుణంగా స్కాలర్‌షిప్‌లు పెంచాలని విద్యార్థుల డిమాండ్‌
 -విద్యార్థుల ఆందోళనతో దద్దరిల్లిన ధర్నా చౌక్‌  
 -మద్దతు తెలిపిన బీసీ సంఘాలు

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: పెరిగిన ధరలకనుగుణంగా స్కాలర్‌షిప్‌లు, మెస్‌ చార్జీలు పెంచాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. విఆర్‌ఎ, విఓఎ, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంచిన ప్రభుత్వం, విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రంగాలలో పనిచేస్తు న్న ప్రభుత్వ ఉద్యోగులకు అడిగిన దానికంటే ఎక్కువ వేత నాలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద విద్యార్థుల సమ స్యలను పెద్ద మనసుతో పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇందిరాపార్‌‌క ధర్నా చౌక్‌లో భారీ ధర్నా నిర్వ హించారు. విద్యార్థుల ధర్నాకు సంఘీబావం తెలిపిన బీసీ నేత, ఆర్‌.కృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ 2011 లో అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో పెంచిన స్కాలర్‌షిప్‌‌స, మెస్‌ చార్జీలు ఇస్తున్నారని, ప్రస్తుతం నిత్యా వసర వస్తువుల ధరలు రెట్టింపు అయినందున కాలేజీ విద్యార్థుల మెస్‌ చార్జీలను పెంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేప ట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకను గుణంగా విద్యార్థుల స్కాలర్‌ షిప్‌‌స, మెస్‌ చార్జీలు పెంచా ల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ ధర్నా కార్య క్రమంలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, జాతీయ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ర్యాగ అరుణ్‌, ఎ.రాంకోటి, రామలింగం, అనంతయ్య, గజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa