ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రేటర్‌ ఓరుగల్లు రూపు రేఖలు మార్చేందుకు సర్కార్‌ కసరత్తు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 01:07 AM

-వరంగల్‌ నగరాభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌
-రాష్ట్ర బడ్జెట్‌లో  ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్న సర్కార్‌
-డిపిఆర్‌ల రూపకల్పనపై అధికారులలో కొరవడిన శద్ధ
-ఇప్పటి వరకు సమర్పించకపోవడంతో నిలిచిపోయిన నిధుల విడుదల
-కార్పొరేషన్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు

మేజర్‌ న్యూస్‌ తెలంగాణ  ప్రతినిధిః తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌ అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ కంకణం కట్టుకున్నారు. చారిత్రాక నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ను గ్రేట్‌ ఓరుగల్లుగా మార్చేందుకు చర్యలు చేపడతామని హమీ ఇచ్చారు. అన్నట్లుగానే ముఖ్యమంత్రి మాట నిలుపుకున్నారు. వరంగల్‌ పర్యటనలో ప్రకటించినట్లే మహ నగర అభివృద్ది కోసం 2016-17 బడ్జెట్‌లో 300 కోట్ల రూపాయల నిధులు కెటాయించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. వరంగల్‌కు 300 కోట్లు, ఖమ్మం, కరీంనగర్‌, రామగుండం, నిజామాబాద్‌ కార్పోరేషన్లకు 100 కోట్ల రూపాయల చొప్పున కెటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో ఆరు నెలల క్రితం వరంగల్‌లో పర్యటనలో ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాలు ప్రారంభమవుతాయని, ప్రణాళికలు గాడిన పడుతాయని అందరు ఊహించారు. దీనికి ప్రజామోదమా అన్నట్లు ముఖ్యమంత్రి పర్యటన తరువాత మూడు నెలలకు జరిగిన కార్పోరేషన్‌ ఎన్నికలలో ప్రజలు టిఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. మహ నగర పాలక సంస్థ పాలకవర్గం కొలువుదీరిన వేళ కొత్తగా కార్పోరేషన్‌కు ముఖ్యమంత్రి ప్రకటించిన నిధులు వస్తాయని మేయర్‌, డిప్యూటి మేయర్‌, కార్పోరేటర్లు అందరు సంతోషం వ్యక్తం చేశారు. నిధులు రావడమే తరువాయి అభివృద్ది పరుగులు పెట్టడం ఖాయమని అనుకుంటున్న తరుణంలో నిధులపై సందిగ్దత నెలకొంది. నాలుగు నెలలు గడిచిన ఇప్పటి వరకు నిధులపై ఉలుకు పలుకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తాయనే ఆశతో గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ అధికారులు సాదారణ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. గతంలో ఆరు నెలల క్రితం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి హన్మకొండ లోని నందనాగార్డెన్‌‌సలో వరంగల్‌ నగరాభివృద్ది పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక నిధులను ఏ అవసరాలకు వాడుకోవాలనే అంశంపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్న నిధుల రాకపై ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయింది. దీంతో బల్దియా అధికారులు డిటైల్‌ ప్రాజెక్టు రూపకల్పన పై దృష్టి  సారించలేదు.
కేంద్ర పథకాలతో అనుసందానం..?
పట్టణాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం స్మార్‌‌టసిటీ, అమృత్‌ పథకాలు అమలు చేస్తుంది. ఈ రెండు పథకాలలో వరంగల్‌ ఎంపిక అయింది. అమృత్‌ పథకం కింద గత ఏడాది 55 కోట్ల రూపాయలు కెటాయించారు. ఈ రెండు పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద నిధులు సమకూర్చాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బడ్జెట్‌ నుండి కెటాయించిన నిధులను ఈ పథకాలకు అనుసందానం చేయనుందని పేర్కొంటున్నారు. ఆర్థిక మంత్రి ప్రకటన మేరకు ఏటా 300 కోట్ల రూపాయల చొప్పున మూడేళ్లపాటు 900 కోట్ల రూపాయల నిదులను విడుదల చేయాలి. ఇంత పెద్ద మొత్తం తో పాటు స్మార్‌‌ట, అమృత్‌ పథకాలకు తన వాటా ఇవ్వడం భారంతో కూడుకున్న వ్యవహరమని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
      అయితే నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ మాత్రం నిధుల రాకపై ఆశావాహ దృక్పథంలో ఉన్నారు. ఈ విషయమై సూర్య బృందం ఆయనతో మాట్లాడినపుడు స్మార్‌‌ట, అమృత్‌ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వ నిధులను అనుసందానం చేస్తామని చెప్పారు. ఈ నిధులతో వీదివ్యాపారుల జోన్లు, స్మశాన వాటికలు, కొత్త రహదారులు, కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. నగర పాలక సంస్థ అధికారులు డిపిఆర్‌ను రూపొందించే పనిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa