ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌ జోరు.. టిఆర్‌ఎస్‌ బేజారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 01:33 AM

 -తాండూరు మునిసిపల్‌ చైర్మన్‌ హస్తగతం
 -చేతులెత్తేసిన మి్తప్రక్ష కౌన్సిలర్లు
 -చతికిలపడ్డ మంత్రి మహేందర్‌రెడ్డి
 -చక్రం తిప్పిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌
-మునిసిపల్‌ దెబ్బతో కోలుకోలేని టిఆర్‌ఎస్‌ నేతలు

(సైబరాబాద్‌ ప్రతినిధి-మేజర్‌న్యూస్‌) : అందరూ ఉహించినట్లుగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకుని అధికారం చేపట్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం  ఇచ్చింది మేమేనని కాంగ్రెస్‌,  తెచ్చింది మేమేనని తెరాసల నినాదాలకు గత ఎన్నికల్లో ప్రజలు తెరాస వైపు మొగ్గుచూపారు. తాజాగా తాండూరు మున్సిపల్‌ రాజకీయాలు పరిశీలిస్తే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనని నేతలు గుర్తించారు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను మున్సిపల్‌ గద్దెనెక్కించారు. వైరివర్గాల్లోని అనైక్యతను తమకు అనూలంగా మార్చుకుని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ తనదైన శైలిలో చక్రం తిప్పారు. వెరసి తాండూరు మున్సిపల్‌పై కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడించారు.  ఈక్రమంలో వికారాబాద్‌ జిల్లాలో ప్రతి పక్ష కాంగ్రె స్‌ పార్టీ దూసుకెళ్తుండగా..అధికార టిఅర్‌ఎస్‌ పార్టీ వెనుకబడిపోయింది.ఇందుకు ఉదాహరణగా తాండూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కాంగ్రె స్‌ పార్టీ కైవసం చేసుకోంది. జిల్లాలో కాంగ్రె స్‌ పార్టీ దూకుడుకు ఇతర పార్టీలు బేజారవుతున్నాయి. జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో కాంగ్రేస్‌కు తిరుగులేదన్న రితిలో రోజు రోజుకు పార్టీ బలపడుతుంది. అధికార పార్టీ నాయకులు మాత్రం అధికారం మనదే అన్న చందƒ ంగా వ్యవహరిస్తున్నారు. తాండూరు మున్నిపల్‌ ఎన్నికల్లో కాంగ్రేస్‌ దెబ్బకు మంత్రి మహేందర్‌రెడ్డికి కోలుకోలేకపోతున్నారు. అఖరి క్షణంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌,తాండూరు కాంగ్రేస్‌ పార్టీ ఇంచార్జిలు చక్రం తిప్పి అధికార పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. గత అసెంబ్టీ ఎన్నికల్లో అధికార పార్టీ, ఎంఐఎం పార్టీలు పోత్తుతో మున్నిపల్‌ చైర్మన్‌  పదవిని కైవసం చేసుకున్నారు. తాండూరులో ఎదురులేని మంత్రి మహేంద్రుడికి కాంగ్రేస్‌ పార్టీతో పాటు టీడిపి, బిజేపిలు కలసి ఘూటుగా ఝలక్‌ ఇచ్చారు. ఊహించని విధంగా కాంగ్రేస్‌ పార్టీ చైర్మన్‌ పదివిని కైవసం చేసుకుంది. గతంలో తాండూరు మున్నిపల్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మేజారిటి రాలేదు. టిఅర్‌ఎస్‌-10, ఎంఐఎం-10, కాంగ్రె స్‌ 8, టీడీపి-2, బిజేపి-1 స్థానాల చోప్పున కౌన్సిలర్‌ లను గెలుచుకున్నారు. ఏ పార్టీకి పూర్తి మెజారీటి రాకపోవడంతో మిత్ర పక్షాలైన టీఅర్‌ఎస్‌ అవగాహనతో చైర్‌ పర్సన్‌ పదవి ఐదేళ్ల కాలాన్ని చెరో రెండున్నరేళ్ల పాటు పంచుకున్నారు. ఈక్రమంలో ఓప్పందం కుదుర్చు కున్నాయి. ఇలా ఒప్పందం ప్రకారం ముందుగా అధికార పార్టీ అభ్యర్ది  విజయ లక్ష్మి చైర్మన్‌గా  ఎన్నికయ్యరు. వైస్‌ చైర్మన్‌గా ఎంఐఎం అభ్యర్ది ఎన్నికయ్యరు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల పదవికాలం పూర్తవడంతో తమ పదవులకు రాజీ నామాలు చేశారు. దీంతో రెండు స్దానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికా రులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సంఘం అదేశాల మెరకు శనివారం తాండూరు మున్నిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికల అధికారి జిల్లా సబ్‌ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝూ ఎన్నికలు  నిర్వహించారు. గతంలో చేసు కున్న ఒప్పందం ప్రకారం ఎంఐఎం అభ్యర్ది  చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా టిఅర్‌ఎస్‌ అభ్యర్ది ఎన్నిక చేసుకోవాలని ఇరు పార్టీల నాయకులు అవగాహనతో ఎన్నికల హాల్‌లోకి వెళ్లి కుర్చున్నారు. అందరు కౌన్సిలర్‌లు తమ సీట్లలో కుర్చుని ఎన్నికలకు సిద్దంగా ఉన్నారు. జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డి సమక్షంలోనే పలువురు కౌన్సిలర్‌లు పార్టీకి షాకిచ్చారు. ఎన్నికల హల్‌లో ఊహించని పరిమాణం ఎదురైంది. అందరు  ఊహించిన విధంగానే  ఎంఐఎం పార్టీ అభ్యర్ది తాండూరు చైర్మన్‌ అవుతాడని అనుకున్నారు. హఠాత్తుగా ఎన్నికల ప్రక్రియ  ప్రారంభం కాగానే ఎంఐఎం అభ్యర్దులు ఎవరు చెర్మన్‌గా నిలపడటంలేదని ఆ పార్టీకి చేందిన కౌన్సిలర్‌ సాజిద్‌ ఆలీ ప్రకటించడంతో మంత్రి మహేందర్‌రెడ్డి షాక్‌కు గురయ్యరు.
   ఎంఐఎం పార్టీ కౌన్సిలర్‌లు ఇచ్చిన షాక్‌ నుంచి తెరుకునే లోపే  హాల్‌ లో వాతవరణం వెడిక్కింది. ఎంఐఎం చెందిన 10 మంది కౌన్సిలర్‌ లల్లో 6 గురు కౌన్సిలర్‌లు తాము ఎవరీని నిలపడంలేదని స్పష్టం చేశారు. ఎంఐఎంకు చేందిన మిగిలిన 4 కౌన్సిలర్‌లు చీలిక వర్గంగా ఏర్పడ్డారు. మంత్రి మహేందర్‌రెడ్డి కలిపించుకుని  ఒప్పందం ప్రకారం మిత్ర పక్షాలుగా అభ్యర్దిని నిలపెట్టాలి కదా అని వారించినా ఎవరు పట్టించుకోలేదు.  ఎన్నికల అధికారి ముందుకు చైర్మన్‌ అభ్యర్దిని టీడీపీ, బిజెపిలు కూడా ఎవరీని ప్రకటించలేదు. ఇక మిగిలిన కాంగ్రేస్‌ పార్టీ తమ చైర్మన్‌ అభ్యర్దిగా కౌన్సిలర్‌ సునితా సంపత్‌ను ప్రకటించారు. నింబంధనల ప్రకారం చేతులేత్తే ప్రక్రియను ఎన్నికల అధికారి నిర్వహించగా, సునితా సంపత్‌కు 8 ఓట్లుతో పాటు టీడీపీ 2, బీజెపీ 2, ఎంఐఎం చీలిక వర్గం నుండి వచ్చిన 6 గురు కౌన్సిలర్‌ల మద్దతు లభించింది.
  కాంగ్రెస్‌ అభ్యర్థికి 17 ఓట్లు వచ్చాయి.
  తాండూరు మున్సిపల్‌లో 31 మంది కౌన్సిలర్‌లతో పాటు స్దానిక ఎమ్యేల్యే మహేందర్‌రెడ్డి కూడ ఓటు ఉంటుంది. అంటే మొత్తం 32 ఓట్లయ్యాయి. అయితే కాంగ్రేస్‌ అభ్యర్థి సునితా సంపత్‌కు 17 రావడంతో చైర్మన్‌గా ప్రకటిం చారు. వైస్‌ చైర్మన్‌గా చీలిక వర్గంలోని అసిప్‌ను ఎన్నిక చేశారు. టిఅర్‌ఎస్‌ కౌన్సిలర్‌లు 10, మిగిలిన ఎంఐఎం కౌన్నిలర్‌లు 4, మంత్రి మహేందర్‌రెడ్డి ఒక్క ఓటు మొత్తం 15 ఓట్లు రావడంతో చైర్మన్‌ పదవిని చేజారిపోయింది. ప్రతి పక్షపార్టీ దెబ్బకు మంత్రి మహేందరెడ్డితో పాటు కౌన్సిలర్‌లు ఒక్కసారిగా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa