హైదరాబాద్: షీ టీమ్స్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అని సినీ నటి అక్కినేని అమల అన్నారు. నగరంలోని పీపుల్స్ ప్లాజాలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవాళ 5కె రన్‌ను చేపట్టారు. నేర రహిత హైదరాబాద్ కోసం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రన్‌ను నిర్వహించారు. ఈ పరుగు కార్యక్రమానికి డీజీపీ అనురాగ్ శర్మ, స్వాతిలక్రా, నటీమణులు అమల, తాప్సీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. యువతియువకులు వేల సంఖ్యలో పరుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa