ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధిపతి మోహన్ భగవత్‌కు డీ.లిట్ (డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లెటర్స్) పట్టాను ప్రదానం చేయబోతున్నారు. నాగపూర్‌లోని మహారాష్ట్ర పశు, మత్స్య శాస్త్రాల విశ్వవిద్యాలయం ఈ పట్టాను ఇవ్వబోతోంది. గోశాలల ఆర్థిక వ్యవస్థ ఆవుల పాలపై ఆధారపడదని, ఆవుల మూత్రం, పేడ చాలా విలువైనవని నిరూపించినందుకు భగవత్‌కు ఈ విధంగా సత్కరించబోతోంది. నాగపూర్‌లోని ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో భగవత్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఈ నెల 9న జరిగే కార్యక్రమంలో ఆయనకు డీ.లిట్‌ను మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa