-పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు
-ఉదయం 4 గంటలకే పూజా కార్యక్రమాలు|
-సాయం్త్రం 4.30 గంటలకు శ్రీ సత్యనారాయణస్వా మి వ్రతాలు
హైదరాబాద్, మేజర్‌న్యూస్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర సింహస్వామి వారి ఆలయంలో ఉదయం 4 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 4 గంటలకు సుప్రభాతం, 4.30 గంటలకు తిరువారాధన, 5 గంట లకు బాలభోగం, ఉదయం 6.15 గంటలకు తులసీ అర్చన, 7 గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవు తాయి. 7:30 నుంచి 8:15 వరకు నిజాభిషేకం, 10 నుంచి 12 గంటల వరకు నిత్యకల్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు నివేదన, సాయంత్రం 5గంటలకు నిత్యాలంకర తిరువీధి సేవ, రాత్రి 7 గంటలకు ఆరాధన, 7.30 గంట లకు తులసీకుంకుమార్చనలు, ఆంజనేయస్వామి వారికి
సహస్రనామార్చనలు, 9గంటలకు ఆరగింపు, 9.45 గం టలకు శయనోత్సవం జరుగుతాయి. కొండపై శ్రీ పర్వత వర్థినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు పూజలు కొనసాగుతాయి.
పాతగుట్ట గుడిలో: పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం 5 గంట లకు సుప్రభాతం, 5.45గంటలకు బిందె తీర్థం, 6.15 గంటలకు ఆరాధన, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు దైవదర్శనాలు, 8 గంటలకు అభిషేకం, 8.30 గంటలకు అర్చన, మధ్యాహ్నం 12 గంటలకు ఆరగింపు, ఉదయం 9.30 గంటలకు, 11 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు శ్రీ సత్యనారాయణస్వా మి వ్రతాలు కొనసాగుతాయి. సాయంత్రం 5.30 గంటలకు అలంకార సేవలు, రాత్రి 7.30 గంటలకు నివేదన, 8 గంటలకు ఆలయ బంధనం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa