ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కేసీఆర్‌ పాలనపై కేంద్రం కితాబు : ఎంపీ వినోద్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 01:01 AM

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధిః  రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు కితాబిచ్చిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో వినోద్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మెచ్చుకున్నారని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాషా్టన్న్రి ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ సమర్థవంతంగా పాలిస్తోందని కితాబిచ్చారని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఎంపీలమంతా సఫలీకృతులమయ్యామని తెలిపారు. కుల వృత్తులను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. కురుమ, యాదవులకు గొర్రెలను ఇస్తున్నారని వెల్లడించారు. అన్ని మండల కేంద్రాలకు కేసీఆర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను మంజూరు చేశారని గుర్తు చేశారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతున్నారని స్పష్టం చేశారు. కేజీ టు పీజీలో భాగంగానే మండల కేంద్రాల్లో గురుకుల పాఠశాలల నెలకొల్పుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకున్న ఈటల రాజేందర్‌ ప్రజల మనిషి అని పేర్కొన్నారు. ప్రతీ వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇచ్చే విషయంలో ఈటల కౄఎషి మరవలేనిదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై విజిలెన్‌‌స నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్లు విమర్శించడం సరైనది కాదన్నారు.  తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డిలపై కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు.  ఈటెల ప్రజల మనిషి అని, సమర్ధుడు కాబట్టే సీఎం కేసీఆర్‌ ఆర్ధిక, పౌరసరఫరాల శాఖలు ఇచ్చారన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ సైతం జీఎస్‌టీ మీటింగ్‌లో ఈటెలను అభినందించారని తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నారని చెప్పారు.
ఈటెల సంక్షేమ హాస్టల్‌లో చదువుకున్న వ్యక్తి అని, కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని కొందరు బీసీ నాయకులు తప్పు పట్టడం దురదృష్ట్టకరమని ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి ఏదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీలో మాట్లాడొచ్చు. మంత్రులను దోషులనడం సమంజసం కాదన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa