ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న రాజకీయ పార్టీలపై మండిపాటు
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న తెలుగు ప్రభుత్వాలు
స్వాతం్త్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా బడుగుల దరిచేరని అభివృద్ధి
బీసీలను మోసం చేస్తోన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు సిద్ధం!
జనాభాలో అధిక శాతం ఉన్నా అభివృద్ధిలో అట్టడుగేనా?
ఉద్యమ బాట పట్టేందుకు `సై' అంటున్న బీసీ సంఘాలు
తెలుగు రాష్ట్రాల్లో జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్
తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో అధికశాతం కేటాయించాలి
విద్యా ఉద్యోగ రంగాలలో 25 నుంచి 56 శాతానికి పెంచాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 నుంచి 56 శాతానికి పెంచాలి
హైదరాబాద్, మేజర్‌న్యూస్ : తెలుగు రాషా్టల్ల్రో రాజ్యాధి కారం కోసం పోరాటం చేసే దిశగా బడుగుల అడుగులు ముందుకు సాగుతున్నాయి. జనాభాలో అత్యధిక శాతం ఉన్న తమ సామాజికవర్గానికి దక్కాల్సిన హక్కులను కాలరాస్తున్న తెలుగు ప్రభుత్వాలపై బడుగు నేతలు మం డిపడుతున్నారు. తెలంగాణలో 56 శాతం, ఆంద్రప్రదే శ్‌లో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు పెద్దపీట వేస్తామని ఎన్నికల సందర్భంగా ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఏపీలో చంద్రబాబు అనేక వాగ్దానాలు గుప్పించి, తీరా అధికారం చేపట్టి, మూడేళ్లు కావస్తున్నా, ఇచ్చిన హామీల ను అమలుచేయడం లేదని ఆగ్రహం వక్యం చేస్తున్నారు. అధికారం కోసం వారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, వారు చేస్తోన్న పాలనపై మండిపడుతన్నారు. జనా భాలో అధిక శాతం ఉన్న బీసీలను మోసం చేయడంలో వీరిద్దరూ ఆరితేరారని, ఇకవీరి ఆటలుసాగనిచ్చేది లేదం టూ రాజకీయ పార్టీల కతీతంగా ఉద్యమ బాట పట్టేందుకు సై అంటూ కదం తొక్కేందుకు బీసీ సంఘాలు ముం దుకు సాగుతున్నాయి. ఇక ఈ చంద్రుల మోసాలను ఎండగట్టేందుకు తమ సామాజిక వర్గాన్ని చైతన్య పరచడమే ఎజెండాగా ముందుకు సాగను న్నాయి. కాగా... ఎన్నికలొచ్చాయంటే మైకుల ముందు తెగ ఊగిపోతూ ఊక దంపుడు ఉపన్యాసాలతో చెలరేగి పోతుంటారు కొంత మంది కరడుగట్టిన రాజకీయ నేతలు. జనాలను చూసే సరికి వారిని ఎలాగైనా బుట్టలో వేసుకుని, అధికారం చేజిక్కించుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అందుకోసం ఎలా ంటి హామీలను ఇచ్చేందుకైనా వెనకాడరు. సరిగ్గా ఇలాంటి కోవకు చెందిన వారే తెలుగు రాషా్టల్ర ముఖ్యమంు్తల్రు మన తెలుగు చంద్రులు. జనాభాలో అధిక శాతం ఉన్న బడుగులను మోసం చేయడంలో వీరిద్దరూ ఆరి తేరారు. ఇటు తెలంగాణలో కరీంనగర్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల కోటాను 33 శాతం నుంచి 45 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని, ప్రతి వార్షిక బడ్జెట్‌లో 5వేల కోట్లు కెటాయిస్తామని, ఫెడరేషన్లకు, కార్పొరేషన్లకు అధిక నిధులను కెటాయిస్తామని బడుగుల సంక్షేమాన్ని వేలాది మంది జనం సాక్షిగా హామీ ఇచ్చారు. తీరా... అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా... ఇంత వరకు ఆ హామీల ఊసే ఎత్తడం లేదు. అటు ఆంద్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయు డు పాదయా్తల్రో బీసీలకు ఎన్నో వాగ్దానాలను గుప్పించారు. ఒక సందర్బంలో చేతివృత్తి దారులను చూసి మొసలి కన్నీరు కార్చారు కూడా... చేతివృత్తి దారుల కుటంబాల జీవితాలను చూస్తే నా మనసు కరిగిపోతోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని కల్లబొల్లి కబుర్లతో బీసీల కడుపు నింపినట్లు నమ్మింపజేశారు..నారా వారు. ఎట్టకేలకు అధికారం చేపట్టారు. అయినా... ఆయన మనసు కరగడం లేదు.. కాదు గదా కనీసం ఆ ఊసే ఎత్తడం లేదు. అనాదిగా వస్తోన్న అగ్రవర్ణాల పాలనలో ఉమ్మడి రాష్ట్రంతో పాటు విభజన అనంతరం ఇటు తెలంగాణలో 56శాతం, అటు ఆంద్రప్రదేశ్‌లో 50శాతానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు అన్ని రంగా లలో అన్యాయం జరుగుతూనే ఉంది. అలాగే..పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశ
పెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచి, బిల్లును ఆమోదింప జేసేలా చర్యలు చేప ట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో అధిక శాతం ఉన్న బీసీల సమస్యలను, డిమాండ్లను విస్మరించారని పాలకులపై విమర్శ నాసా్తల్రు ఎక్కుబెట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో... తమ సమస్యలు పరిష్కరించాలని బీసీలు తెర పైకి రావడంతో అధికార పక్షంలో ఆందోళన మొదలయ్యింది. కులానికో వరం అంటూ గొర్రెలు, బర్రెలు, పందులు పెంచుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. లక్ష ఉద్యోగాల మాట ఏమయ్యిందని బీసీ నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. తెలంగాణలో 12శాతం జనాభా ఉన్న ముస్లిం మైనార్టీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో 12శాతం రిజర్వే షన్లు పెంచాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించడంతో, తమ సామాజిక వర్గం పరిస్థితి ఏమిటని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 56శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో 25శాతం నుంచి 56శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ ఇతర సామాజిక వర్గాలను ప్రోత్సహించడానికి మా్తమ్రే కాదని, బీసీల హక్కులు కాపాడాలని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు బీసీ కమిషన్ కమిటీకి సూచిస్తున్నాయి. తెలంగాణలోని 150 బీసీ కులాలల్లో ఇంతవరకు రాజకీయ ప్రాతినిథ్యం దక్కని కులాలే అధికం. విద్య లేని కారణంగా ఇంకా దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలుగు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే 4వ వార్షిక బడ్జెట్‌లో బీసీలకు అధిక నిధులు కేటాయించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa