ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినితికి కళ్లెం వేస్తాం!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 01:16 AM

-పన్ను ఎగవేతకు పాల్పడేవారిని విడిచిపెట్టేది లేదు
-అధికార సమాజ్‌వాదీ ప్రభుత్వం వల్లే వారణాసి వెనుకబాటు
-మన దేశ వీరజవాన్లు శు్తవ్రులను చీల్చిచెండాడారు
-కాంగ్రెస్‌, బీఎస్‌పీ, సమాజ్‌వాదీ పార్టీలు నోట్ల రద్దును వ్యతిరేకించాయి  
-ఇప్పుడు ఏకతాటికి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి  
-పూర్వాంచల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా కల
-పూర్వాంచల్‌లో సహజవనరులతో పాటు, యువశక్తి నిండుగా ఉంది  
-వారణాసి రూపురేఖలు మార్చివేసి, ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతా!  
-రాహుల్‌, అఖిలేష్‌లకు ప్రజల సమస్యలు ఏమి తెలుసు?  
-వారణాసి బహిరంగ సభలో మోడీ

వారణాసి: నిజాయితీ గల ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పడే అవినీతికి కళ్లెం పడుతుందని, అదే పని తాము చేస్తున్నామని, పన్ను ఎగవేతకు పాల్పడే ఏ ఒక్క వ్యాపారిని కూడా విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత పాలకుల హయాంలో అన్నీ కుంభకోణాలే చోటుచేసుకున్నాయని, ప్రజలు ఎంతసొమ్ముపోయిందనే విషయం గురించే మాట్లా డుకునేవారని, ఈరోజు ఎంతసొమ్ము వెనక్కి వచ్చిం దని అడుగుతున్నారని, అదే తమ ప్రభుత్వం సాధిం చిన ఘనతని ఆయన పేర్కొన్నారు. వారణాసిలో ఆదివారం భారీ రోడ్‌షో అనంతరం జరిగిన బహి రంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అధికార సమాజ్‌వాదీ ప్రభుత్వం వల్లే వారణాసి తగిన మౌలిక వసతుల కల్పనకు నోచుకోలేదని ఆరోపించారు. నగరమంతా గుంతలు పడిం దని,వారణాసి అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులను పూర్తిగా వినియో గించుకోలేదని అన్నారు. తాము గంగా జలాల శుద్ధి ప్రాజెక్టు చేపట్టినా, అండర ్‌గ్రౌండ్‌ వైరింగ్‌ చేపట్టినా పర్యాటకరంగ అభివృద్ధికి అవి దోహదపడతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తాము జవాన్లకు ఇచ్చిన ఓఆర్‌ఓపీ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకున్నామని అన్నారు. సర్జికల్‌ దాడులను రాజకీయం చేస్తున్న వారిపై కూడా ప్రధాని విరుచుకుపడ్డారు. మనదేశ వీరజవాన్లు శత్రువులను చీల్చిచెం డాడారని ప్రశంసించారు. అయితే మన జవాన్ల పట్ల నమ్మకం లేని ప్రత్యర్థులు సర్జికల్‌ దాడులకు ఆధారాలు అడుగుతున్నారని, ఎంతమంది జవాన్లు చనిపో యారనే విషయం సరిహద్దు ఆవల ఉన్నవారిని అడిగి తెలుసుకుంటున్నారని, నిజానికి ఒక్క సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోకుండా వెనక్కి తిరిగి రావడం జరిగిందని ప్రధాని వివరించారు. కాంగ్రెస్‌, బీఎస్‌పీ, సమాజ్‌వాదీ పార్టీలు ఒకరికొకరు బద్ధశత్రువులైనా నోట్ల రద్దు నిర్ణయాన్ని తాను ప్రకటించిన తర్వాత అంతా ఏకతాటిపైకి వచ్చారని విమర్శించారు. నిజాయితీపరులకు ఎప్పుడూ ఎలాంటి కష్టాలు ఉండని తాను భరోసా ఇస్తున్నానని మోడీ ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పూర్వాంచల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన కల అని మోడీ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని అధికార ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. పూర్వాంచల్‌ ప్రాంతంలో సహజవనరులతో పాటు, యవశక్తి నిండుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదన్నారు. పూర్వా ంచల్‌ను అభివృద్ధి చేసిన తరువాతే ఉత్తరప్రదేశ్‌.. దేశంలో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకుంటుందన్నారు. అలాగే సమాజ్‌వాది పార్టీ కేంద్రం నుండి విద్యు త్‌కు సంబంధించి అందాల్సిన సాయాన్ని సద్వినియోగం చేసుకోలేదని పేర్కొ న్నారు. పూర్వాంచల్‌ను ఎలా అభివృద్ధి చేయాలో తనకు బాగా తెలుసునని అన్నారు. కాగా సమాజ్‌వాది పార్టీ, బహుజనసమాజ్‌ పార్టీ రెండూ కూడా నాణానికి రెండు వైపుల వంటివన్నారు. వారణాసిని సమూలంగా అభివృద్ధి చేయాలని, కాశీ రూపురేఖలు మార్చివేయాలన్నిదే తన లక్ష్యమని మోడీ పేర్కొ న్నారు. వారణాసిని ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. వారణాసిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిలపాలన్నదే తన క్ష్యమన్నారు. ప్రపం చంలోని చాలామంది ఒక్కసారైనా కాశీని సందర్శించాలని భావిస్తారన్నారు. రాహుల్‌, అఖిలేష్‌లపై విమర్శనాసా్తల్రు సంధించిన మోడీ వారిద్దరూ బంగారు చెమ్చాలతో పుట్టారని, వారికి ప్రజల సమస్యలు ఏమి తెలుసునని ప్రశ్నించారు. వారికి సమస్యల గురించి ఏమీ తెలియదని, ఇటువంటివారు పరిపాలన చేపడితే ఏం నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కాగా మోడీ తన ప్రసంగంలో భారత్‌ మాతాకీ జై, హర్‌ హర్‌ మహాదేవ్‌ అని నినాదాలు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa