ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పది రోజుల్లో మూడో విద్వేష దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 01:19 AM

-అమెరికాలో ఇంకో ఘోరం  
-మీ దేశానికి వెళ్లిపో' అంటూ సిక్కు యువకుడిపై ఇంటి ముందే కాల్పులు
-దుండగుల కాల్పుల్లో గాయపడ్డ దీప్‌ రాయ్‌కు ప్రమాదం తప్పింది: సుష్మా స్వరాజ్‌
-భారతీయులు మాకు చాలా ముఖ్యం: యూఎస్‌ గవర్నర్‌

వాషింగ్టన్‌ : జాత్యహంకారం నానాటికీ పెరిగిపోతున్న అమెరికాలో మరో ఘోరం జరిగింది. వాషింగ్టన్‌ పరిధిలోని కెంట్‌ సిటీలో ఓ శ్వేతజాతి దుండ గీడు సిక్కు వ్యక్తి (39)పై అతని ఇంటి ముందే కాల్పులు జరిపాడు. తన విధు లను ముగించుకుని ఇంటికి వచ్చిన బాధితుడితో గుర్తు తెలియని వ్యక్తి వాద నకు దిగి, `మీ దేశానికి వెళ్లిపో' అని కేకలు పెడుతూ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో సిక్కు యువకుడి చేతిలోకి బులెట్‌ దిగగా, ఈ ఘటనను తీవ్రం గా పరిగణిస్తున్నామని కెంట్‌ పోలీస్‌ చీఫ్‌ కెన్‌ థామస్‌ వెల్లడించారు. బాధితుడి ప్రాణాలకు అపాయం లేదని వెల్లడించిన ఆయన దుండగీడు ఆరడుగుల ఎత్తు ఉన్నాడని, ముఖానికి మాస్‌‌క ధరించి వచ్చాడని, అతన్ని గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. బాధిత కుటుంబానికి అం డగా ఉంటామని రెంటన్‌ సిక్కు సమాజం నేత జస్మిత్‌ సింగ్‌ వెల్లడించారు.


వాషింగ్టన్‌లో ఓ శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ సిక్కు ఎన్‌ ఆర్‌ఐ దీప్‌ రాయ్‌ (39)కు ప్రమాదం తప్పిందని, కోలుకుంటున్నారని విదేశాంగ శాఖ మంత్రి „సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్‌ చేశారు. దీప్‌ రాయ్‌ తండ్రి సర్దార్‌ హర్‌పాల్‌ సింగ్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని, దీప్‌ రాయ్‌ చేతిలోకి బుల్లెట్‌ వెళ్లిందని, అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నాడని చెప్పారని మంత్రి తెలిపారు. కాగా, అమెరికాలో ఇటీవల జరిపిన కాల్పుల్లో మృతి చెందిన హర్నీష్‌ పటేల్‌ కుటుంబానికి ఆమె తన సానుభూతి తెలిపారు. ఈ హత్య సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని ఆ ట్వీట్‌లో „సుష్మా ఆవేదన వ్యక్తం చేశారు. భారతీ యులు తమ పట్టణానికి చాలా ముఖ్య మైన వారని అమెరికాలోని కాన్సాస్‌ గవర్నర్‌ శ్యామ్‌ బ్రౌన్‌బ్యాక్‌ అన్నారు. వారికి తమ నగరంలోకి అన్ని వేళలా స్వాగతం పలుకుతామని చెప్పా రు. ఇటీవల కాన్సాస్‌ నగరంలోని ఆస్ట్రిచ్‌ బారులో తెలుగువారిపై ఓ తెల్లజాతి దురహంకారి కాల్పులు జరపడంతో శ్రీనివాస్‌ కూచిభొట్ల అనే ఇంజనీర్‌ చనిపోగా మరో తెలుగువాడు అలోక్‌ మాదసాని గాయపడ్డాడు. వీరిని రక్షించే క్రమంలో అమెరి కన్‌ కూడా గాయపడ్డాడు. 


ట్రంప్‌ తీసుకున్న వలస దారుల వ్యతిరేక నిర్ణయాల అనంతరం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో కాన్సాస్‌ గవర్నర్‌ ప్రత్యేకంగా భారతీయ దౌత్యాధికారులు, భారత కమ్యూనిటీకి చెందిన ముఖ్యులతో ప్రత్యే కంగా సమావేశమై భరోసా ఇచ్చారు. ఎన్నో దేశాల నుంచి తమ పట్టణానికి వస్తుంటారని, కానీ, భారతీయులు తమ కు చాలా ముఖ్యమైన వారని ఆయన అన్నారు. అలాంటి వారిపై జాతి విచక్షణ పేరుతో హింస జరగడాన్ని తాము అంగీకరించబోమని, మొన్న జరిగిన ఘట నకు సిగ్గు పడుతున్నామని అన్నారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా తాము భారతీయులకు అందిస్తామని చెప్పారు. ఇక భారతీయ కాన్సులేట్‌ తరఫున పని చేసే కాన్సుల్‌ జనరల్‌ అనుపమ్‌ రాయ్‌ మాట్లాడుతూ, గన్‌మేన్‌ నుంచి భారతీయులను కాపాడేందుకు అసమాన ధైర్యం చూపించి తీవ్రంగా గాయపడిన ఇయాన్‌ గ్రిల్లాట్‌ను గురువారం కలుసుకోబోతున్నానని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు తన జీవితంలో ఒక్కసారి కూడా చూడలే దన్నారు. మరో వ్యక్తి కోసం బుల్లెట్‌కు ఎదురువెళ్లిన గొప్ప సాహసి అని అన్నారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa