తిరువనంతపురం : తనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహిం చవద్దని, అందుకు తాను సిద్ధంగా లేనని కేరళ నటి భావ న కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నింది తుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ కోర్టుకు చెప్పాడు. పల్సర్ సునీని అలువా కోర్టులో శనివారం ప్రవేశపెట్టారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి కావాల ంటే నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహి ంచేందుకు అనుమతించాలని, ఈ కేసు విచారణకు సునీ సహకరించడం లేదని, పొంతన లేని విషయాలు చెబుతున్నాడని పోలీసులు కోర్టుకు విన్నవించారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న విగీష్, సునీలకు ఈ నెల 10 వరకు పోలీస్ కస్టడీని కోర్టు పొడిగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa