బ్రిస్బేన్: యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా ఉప సారథి డేవిడ్ వార్నర్‌కు గాయం భయం పట్టుకుంది. మైదానంలో సోమవారం సాధన చేస్తుండగా అకస్మాత్తుగా ఆయనకు మెడ పట్టేసింది. వెంటనే వైద్య బృందాన్ని సంప్రదించిన ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు బుధవారం ప్రారంభం అవుతోంది. గబ్బా మైదానంలో అత్యంత ఎత్తుగా వచ్చిన బంతిని అందుకున్నప్పుడు వార్నర్‌కు మెడ పట్టుకుంది.
నా మెడ పట్టేసుకుంది. అంతెత్తునుంచి వచ్చిన బంతిని అందుకున్నాను. అప్పుడే నా మెడలో ఏదో బెణికినట్టు అయింది. ఇంతకు ముందెప్పుడూ నా మెడ ఇలా లేదు. ఒకటి రెండు రోజుల్లో ఉపశమనం లభిస్తుందని అనుకుంటున్నా. మంగళవారం సాధన చేయాలనుకుంటున్నా. నా టెక్నిక్‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. కాపడం, మసాజ్ ద్వారా నా మెడనొప్పి తగ్గొచ్చు అని వార్నర్ అన్నాడు. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రధాన బ్యాటింగ్ అస్త్రం డేవీనే. స్వదేశంలో అతడి సగటు దాదాపు 60గా ఉంది. అరంగేట్రం చేస్తున్న కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌తో కలిసి అతడు ఓపెనింగ్ చేయాల్సి ఉంది.