హైదరాబాద్: ప్రవాస తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఇంగ్లాండ్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియన్ జింఖానా గ్రౌండ్‌లో జరిగిన వేడుకలకు 300 మంది మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేసి మహిళలకు విందు ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మహిళలు టీఈఎన్‌ఎఫ్ నాయకులను అభినందించారు. ఈ వేడుకల్లో మీనాక్షి అంతటి, హేమలత గంగసాని, శౌరిగౌడ్, శ్రీలక్ష్మి నాగుబండి, జ్యోతి కాసర్ల, జయశ్రీ గంప, గౌరీ, వాణి అనసూరి, రమ, శ్రీవాణి, కావ్య, ప్రియాంక, సంధ్య, మేఘల, సుచరిత, శిరీష తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa