ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8న పన్నీర్‌సెల్వం నిరాహారదీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2017, 09:55 AM

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 8న నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు అనుమతి కోరుతూ పోలీసుశాఖకు ఆయన వర్గీయులు మళ్లీ విజ్ఞాపనపత్రాలు అందించారు. ‘అమ్మ’ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 8న నిరాహారదీక్ష చేయనున్నట్లు పన్నీర్‌సెల్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు అనుమతి కోరుతూ ఆయన శిబిరానికి చెందిన నేతలు రాష్ట్ర డీజీపీ, గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనరు కార్యాలయాల్లో విజ్ఞాపనపత్రాలు అందించారు. పోలీసుశాఖ తన నిర్ణయం ప్రకటించని నేపథ్యంలో మరోమారు గుర్తు చేసే విధంగా సోమవారం మళ్లీ వినతిపత్రాలను అందించారు. గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పన్నీర్‌సెల్వం నివాసం నుంచి రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్‌, రాష్ట్ర మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్‌, విల్లివాక్కం మాజీ శాసనసభ్యుడు జేసీడీ ప్రభాకరన్‌, తదితరులు బృందంగా వెళ్లి డీజీపీ, గేట్రర్‌ చెన్నై పోలీస్‌ కమిషనరు కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa