ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2017, 10:58 AM

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఉపరితలద్రోణి, రాష్ట్రంలోకి మేఘాలు ప్రవేశించడంవల్ల రాత్రి, ఉదయం సమయాల్లో చలిగాలులు వీస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్ సహా పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లి, సూరారం, గండిమైసమ్మ, శామీర్‌పేట తదితర ప్రాంతాల్లో ఒక మిల్లీమీటర్ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. రెండురోజులుగా నగరంలో మేఘాలు కమ్ముకోవడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఉదయం,రాత్రి సమయాల్లో చలిగాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఈ మేఘాల ప్రభావంతో మంగళవారం హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సాధారణమైనవేనని.. ఈ మార్పులు మరో 24 గంటలపాటు ఉండవచ్చని తెలిపింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa