ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలో నెంబర్-1 హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2017, 11:02 AM

ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది నాణ్యమైన సేవలందించినందుకు గాను ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ నిర్వహించిన సర్వేలో ఫస్ట్‌ ప్లేస్‌ సంపాదించింది. ఏటా కోటిన్నర మంది ప్రయాణికుల విభాగంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు తొలిస్థానం వరించిందని ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. 2009లో 4.4 గా ఉన్న హైదరాబాద్ విమానాశ్రయ స్కోర్‌ 2016లో 4.9కు మెరుగుపడిందని ఎయిర్‌పోర్టును నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్‌ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలో జీఎంఆర్ నిర్వహిస్తున్న ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కు కూడా ఏసీఐ అవార్డు వరించింది. ఏటా నాలుగు కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే విభాగంలో నాణ్యమైన సేవలు అందించినందుకు గాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సెకండ్‌ ప్లేస్‌లో నిలిచిందని ఏసీఐ వెల్లడించింది. 2014-15 సంవత్సరాల్లో అగ్రస్థానం దక్కించుకోగా 2015లో 4.96గా నమోదైన ఎయిర్‌పోర్టు స్కోర్ గత సంవత్సరంలో 4.99కి మెరుగుపడింది. ఈ విభాగ ఎయిర్‌పోర్టుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఇంచెన్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కు అగ్రస్థానం లభించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa