రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణ గడువును టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. దరఖాస్తులను ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 7వ తేదీతో గడువు ముగియనుండటంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరో 18 రోజుల పాటు గడువు పొడిగించారు టీఎస్‌పీఎస్సీ అధికారులు. కాలుష్య నియంత్రణ మండలిలో 63 ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa