ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వే లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ను మంత్రులు ఇంద్రకర్‌రెడ్డి, జోగురామన్న కోరారు. హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో జీఎంతో వారు భేటీ అయ్యారు. ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వే లైనును పూర్తి చేయడం ద్వారా ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ చొరవతో రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు రూ. 2800 కోట్లతో ఆర్మూర్-ఆదిలాబాద్ వయా నిర్మల్ మీదుగా మహారాష్ట్రలోని గడ్ చందూర్ వరకు 232 కిలోమీటర్లు రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు అనుమతించారని తెలిపారు. దీంతో జీఎం స్పందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు ఇరువురి మధ్య అవగాహన ఒప్పందం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ఒప్పందం పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించి మూడేండ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఒప్పందంపై త్వరలో సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని మంత్రులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa