ఖమ్మంలో కంచె ఐలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. గొర్రెల కాపరుల బహిరంగ సభకు వెళ్తున్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కంచె ఐలయ్య అరెస్ట్ చేయడంతో సీపీఎం కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఐలయ్య అరెస్ట్ చేసినంత మాత్రనా బహిరంగ సభ ఆగదని, నిర్వహించి తీరుతామని నిర్వాహకులు తెలిపారు. అటు ఐలయ్య పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గొల్ల కాపరులకు అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఐలయ్య ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, ఖమ్మంలో పోలీసుల పనితీరు సరిగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేస్తే సహించేది లేదని కంచ ఐలయ్య హెచ్చరించారు.