ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తలకూ పింఛను ఇచ్చే పథకంపై కసరత్తు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:18 AM

రోహతక్‌: భర్త మృతి చెందితే భార్యకు పింఛను ఇచ్చే పథకాలు పలు రాష్ట్రాల్లో అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, భార్య చనిపోతే కూడా భర్తలకు పింఛను ఇచ్చే పథకాన్ని తీసుకురావాలని హర్యానా సర్కారు యోచిస్తోంది. నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఈ అంశంపైనే ప్రకటన చేశారు. ఈ పథకానికి కావలసిన బడ్జెట్‌, సర్కారుపై పడే అదనపు భారాల వంటి అంశాల గురించి ఆ రాష్ట్ర అధికారులు లెక్కలు చూస్తున్నారు.  దీనిపై ఆ రాష్ట్ర సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తేవాలని చూస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఎమ్మెల్యే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతూ.. భార్యను కోల్పోయిన భర్తని కూడా వితంతువుగానే పరిగణించి వారికి కూడా పెన్షన్‌ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. దీనిపై ఖట్టర్‌ స్పందిస్తూ.. ఈ పథకాన్ని తప్పకుండా పరిశీలిస్తామని  తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa