హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః మహిళా ఉద్యమ వారసత్వం తెలంగాణ అని అలాంటి ఉద్యమ తెలంగాణలో నేడు కేసిఆర్ ప్రభుత్వం మహిళలను వంటింటికే పరిమితం చేసేందుకు కుట్ర చేస్తోందని టీ-పీసీసీప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ విమర్శించారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ జనాభాలో 2 కోట్ల మహిళలున్నా వారికి తగిన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రవణ్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ధీరత్వానికి ప్రతికగా రాణి రుదమ్రా దేవీ, తెగించి పోరాడిన సమ్మక్క, సారక్క, చైతన్యంతో కొంగు నడుముకు చుట్టి ఎదిరించిన చాకలి అయిలమ్మ లాంటి ఎంతో మంది మహిళలు నేటి తరానికి స్పూర్తిగా నిలిచారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆరుట్ల కమలమ్మ, మల్లు స్వరాజ్యం లాంటి ఎంతో మంది ఉద్యమ నేతలు తెలంగాణలో ఉన్నారని గుర్తు చేశారు. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో డిఎస్ పి పదవికి రాజీనామా చేసిన సుమతి, ఉద్యమంలో ఎగిసి పడిన రహీమున్నీసా లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నా కూడా ఈ పాలకులు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కనీసం మహిళలకు సాధారణ రాజకీయ ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని శ్రవణ్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్టప్రతిగా, లోక్సభ స్పీకర్‌గా , ప్రధానమంత్రిగా ఎఐసిసి అధ్యక్షురాలిగా, యుపిఎ చైర్ పర్సన్‌గా అనేక పెద్ద పెద్ద హోదాలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్నారు. ప్రస్తుత పాలకులు కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, శానస మండలిలో ఒక్క మహిళకు కూడా టిఆర్ ఎస్ నాయకత్వం అవకాశం కల్పించలేదన్నారు. నామినేటెడ్ పదవులలో కూడా మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు. మహిళా ప్రాధాన్యత అంటే కేవలం కేసిఆర్ కుటుంబ ప్రాధాన్యతగానే మిగిలిపోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఉన్న మహిళలకు టిఆర్ ఎస్ పాలనా తీరును గమనించాలని ఆయన కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలకు సెలవు ఇచ్చి ఇంట్లోనే ఉండి వంటింటికే పరిమితం కావాలని ఆదేశాలిచ్చినట్టుగా ఉందని ఆయన ఆయన ఎద్దేవా చేశారు. పాలకుల తీరుపైన మహిళలకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa