న్యూఢిల్లీ: 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై అపారమైన ప్రేమ కురిపించిన సంగతి తెలిసిందే. తమను అధికారంలోకి తెచ్చినా? తేకున్నా? బీహార్ అంటే తమకు చాలా ఇష్టమని...బీహార్ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రకటిస్తూ సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చేస్తామని ప్రధాని మన్ కీ బాత్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని హామీల్లో నెరవేరినవెన్నో తెలుసుకునేందుకు ముంబయికి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్ గోల్గాలి ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా ప్రధాని మోడీ ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు ప్రకటించిన భారీ ప్యాకేజీల వివరాలు, వాటిపై చేపట్టిన చర్యలను తెలపాలని కోరారు. ఈ పిటిషన్ ను అనిల్ 2016 డిసెంబరులో దాఖలు చేయగా....దానికి ఆర్థిక శాఖ డిప్యూటీ డెరెక్టర్ ఆనంద్ పర్మార్ సమాధానమిచ్చారు. దీనికి నేరుగా సమాధానమిచ్చేందుకు నిరాకరించిన ఆయన ఈ మొత్తం హామీలకు కలిపి సమాచారమిచ్చారు. వాటి వివరాల్లోకి వెళ్తే....బీహార్ 1.25 వేల కోట్ల ప్యాకేజీ నిధులు విడుదల చేయనప్పటికీ...బీహార్ లో పలు పనులు దశలవారీగా పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. అలాగే జమ్ము కశ్మీర్ కు ప్రకటించిన 80 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ, సిక్కింకు ప్రకటించిన 43 వేల కోట్ల రూపాయల ప్యాకేజీకి కూడా ఇదే పరిస్థితని తెలిపారు. నిధులు విడుదల చేయకపోయినా...పనులు చేస్తున్నామని తెలిపారు. దీనిపై అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకుండా పనులెలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa