ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:41 AM

 ప్రశ్నించే శక్తులు లేకుండా చేయాలనే కుట్ర


 ఇద్దరు టీజేఏసీ నేతల సస్పెన్షన్‌


 తెలంగాణ రాజకీయ ఐకాస


హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి ః  పాలనపై ప్రశ్నించే శక్తులు లేకుండా చేయాలనే కుట్రను తిప్పికొట్టాలని తెలంగాణ రాజకీయ ఐకాస నిర్ణయించింది. మంగళవారం నాడు  జరిగిన ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణని ఖండిస్తున్నట్లు ఐకాస స్పష్టం చేసింది. వివిధ అంశాల్లో ప్రభుత్వ వెఫల్యాలను వెలుగులోకి తెచ్చేందుకు ఐకాస భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. తమ నేతలు పిట్టల రవీందర్‌, నల్లపు ప్రహ్లాద్‌ ను జేఏసీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజేఏసీ) ప్రకటించింది. ప్రజల సమస్యలు పరిష్కరించే బదు లు, ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న శక్తులను బలహీన పరచాలని నేతలు ప్రయత్నించారని ఆరోపించింది. దీనికోసం అనైతిక పద్ధతుల ద్వారా అధికార దుర్విని యోగానికి పాల్పడ్డారని తెలిపింది. ప్రజాస్వామిక విలువలపై కనీస గౌరవమున్న వారు చేసేపని ఇది కాదని పేర్కొంది. దీంతో పాటు ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణిని ఖండించింది. 


ప్రభుత్వ ప్రలోభాలకు తలొగ్గి కొందరు చేస్తున్న ప్రకటనలతో జేఏసీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వీటివల్ల జేఏసీ తన కార్యాచరణను మరింత బలంగా ప్రజలలోకి తీసుకుపోవడానికి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడింది. నిరుద్యోగ నిరసన ర్యాలీ తదనంతర పరిణామాలపై టీజేఏసీ ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఆ ర్యాలీ విజయవంతం కావడం, జేఏసీ ప్రజల బలమైన గొంతుకగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని పాలకులు తమ కుట్రలను తీవ్రతరం చేశారని ఆరోపించింది.


కాగా, కార్పొరేట్‌ స్కూళ్ళు, కాలేజీ ఫీజులు యథేచ్ఛగా పెంచుతుండటంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని,  అయితే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం చట్ట పరిధిలో ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణకు కార్యాచరణ చేపట్టాలని జేఏసీ నిర్ణయించినట్లు వెల్లడించింది. బడ్జెట్‌ ను అధ్యయనం చేసి బలహీన వర్గాలకు కేటాయించిన నిధుల తరలింపును వెలుగులోకి తేవాలని జేఏసీ తీర్మానించింది. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లాల యాత్రలు చేపట్టాలని, దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే నిర్ణయించి ప్రకటించనున్నట్లు వివరి ంచింది.


ఐకాస స్టీరింగ్‌ కమిటీ నిర్ణయాలు


 పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కార్యాచరణ చేపట్టాలి


 బలహీన వర్గాల నిధుల తరలింపును వెలుగులోకి తేవాలి


 ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లాల యాత్రలు చేపట్టాలి










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa