-లేవనెత్తిన స్టాలిన్, రాందాస్
-పన్నీర్ సెల్వం వర్గం నిరాహార దీక్షలకు డీజీపీ అనుమతి!
-జయలలిత నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
చెనై్న: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంబంధించి అనుమానాలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఆమె మృతి పట్ల అనుమానాల నివృత్తికి ప్రభుత్వం విడుదల చేసిన వెద్య నివేదిక ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిచ్చింది. దిల్లీ ఎయిమ్‌స బృందం అందించిన నివేదికను పళని ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన నేపథ్యంలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామ్‌దాస్ పలు ప్రశ్నలు సంధించారు. స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ జయకు వెద్య సేవలందించిన అపోలో విడుదల చేసిన హెల్‌త బులెటిన్‌లకు, ఎయిమ్‌స వెద్యుల నివేదికకు వ్యత్యాసం ఉందన్నారు. సెప్టెంబర్ 25న అపోలో వెద్యులు విడుదల చేసిన హెల్‌త బులెటిన్‌లో జయ జ్వరం, పోషకాహార లోపంతో ఆస్పత్రిలో చేరారని, మరికొన్ని రోజుల్లో ఇంటికి చేరుకుంటారని తెలిపారని అన్నారు. అదే సమయంలో ఎయిమ్‌స వెద్యుల నివేదిక ప్రకారం సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరేనాటికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పారని అనుమానం వ్యక్తంచేశారు. తాజా నివేదికలో ఇలాంటి పొంతనలేని సమాధానాలెన్నో ఉన్నాయన్నారు. మరోవెపు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ సైతం వెద్య నివేదికలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఎయిమ్‌స వెద్య నివేదిక ప్రకారం అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి ఉప ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై వేలిముద్ర ఎలా వేశారు. జయకు ఎలాంటి చికిత్స అందించారో తనకు అవగాహన లేదని పన్నీర్‌సెల్వం చెబుతున్నారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి విడుదల చేసిన వెద్య నివేదికలో మాత్రం పన్నీర్‌కు అన్నీ తెలుసని అంటున్నారు. ఇందులో ఏది నిజం? అని ప్రశ్నించారు.తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మౄఎతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ, రాష్టవ్య్రాప్తంగా పన్నీర్ సెల్వం వర్గం తలపెట్టిన నిరాహారదీక్షలు, నిరసనలకు డీజీపీ కార్యాలయం అనుమతినిచ్చింది. ఓపీఎస్ వర్గం గత నెల 28న చెనై్న పోలీసు కమిషనర్ కార్యాలయంలో అనుమతి కోరినప్పటికీ సమాధానం రాకపోవడంతో, ఆయన వర్గం నేతలు విశ్వనాథన్, మునుస్వామి, ప్రభాకర్, మైత్రేయన్ తదితరులు డీజీపీని ఆశ్రయించారు. వచ్చే బుధవారం నాడు తాము చేపట్టనున్న దీక్షలకు అనుమతి లభించిందని, తాము ధర్మయుద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. శశికళ మాఫియాలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. అమ్మ మరణంపై తమకున్న అనుమానాలన్నీ నివౄఎత్తి చేయాలని డిమాండ్ చేశారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆ భవనాన్ని మన్నార్ గుడి మాఫియా (శశికళ బంధువర్గం) ఆక్రమించేసింది. తాజాగా ఆ భవంతిని స్వాధీనం చేసుకునేందుకు ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ లు పోయస్ గార్డెన్ లోని వేదనిలయం (జయ నివాసం)కు వస్తున్నారనే వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు అలర్‌ట అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. పోయస్ గార్డెన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. వేద నిలయం లోపల, బయట కూడా పోలీసులు బారులు తీరారు. జయ నివాసం తనకు, తన సోదరి దీపకు మాత్రమే చెందుతుందని గత నెల 23న దీపక్ ప్రకటించారు. అయితే శశికళ ఆ నివాసంలో ఎంతకాలమైనా ఉండవచ్చని చెప్పాడు. మరోవైపు, ఆ భవంతిని జయ స్మారక మండపంగా తీర్చిదిద్దాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ, పోయెస్ గార్డెన్ ను స్వాధీనం చేసుకోవడానికి దీప, దీపక్ లు వస్తున్నారనే సమాచారం తమ వద్ద లేదని తెలిపారు. ఈ విషయాన్ని ఓ లాయర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో, పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa