ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కాలర్‌షిప్స్‌ పెంచాలంటూ సంక్షేమ భవన్‌ ముట్టడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:43 AM

హైదరాబాద్‌ , మేజర్‌న్యూస్‌ : స్కారల్‌సిప్స్‌, మెస్‌చార్జీలు పెంచాలంటూ మంగళవారంనాడు వేలాదిమంది విద్యార్థులు మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌ను ముట్టడించారు. అందరి జీతాలు పెంచుతున్న ముఖ్యమంత్రి మాపై దయచూపండీ అంటూ ధీనంగా వేడుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు తీరా వీఆర్‌ఏ, అంగన్‌వాడీల జీతాలు పెంచిన ప్రభుత్వం హాస్టళ్లలో చదువుకొంటున్న నిరుపేద విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలేదని ధ్వజమెత్తారు. నిరుపేద కుటుంబంలో పుట్టడమే మేం చేసిన నేరమా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాస్ట్రంలో 6లక్షల మంది నిరుపేద ఎస్సీ,ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థులు హాస్టళ్లలో చదువుకుంటున్నారని, స్కాలర్‌షిప్స్‌, మెస్‌చార్జీలు పెంచాలంటూ గత కొంతకాలంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ర్యాగ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్‌షిప్స్‌ పెంచకపోవడం ధారుణమన్నారు. 2012నాటి నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకొని మెస్‌చార్జీలు, స్కాలర్‌షిప్స్‌ను నిర్ణయించారన్నారు. అప్పటి నుంచి అయిదేళ్లలో రెండొందల శాతం వరకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా పాలకులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నిరుపేదల అభ్యున్నతి కోసం ఎంతో చేస్తున్నామంటున్న ముఖ్యమంత్రి నిరుపేద విద్యార్థులు చదువుకొంటున్న హాస్టళ్లలో మెస్‌చార్జీలు, స్కాలర్‌షిప్స్‌ ఎందుకు పెంచడంలేదని నిలదీశారు. పీజీకోర్సులు చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.1100 ఇస్తున్నారని దీంతో ప్రతీ రోజు మూడుపూటల భోజనం పెట్టాలన్నారు. రోజుకు రూ.35లో మూడు పూటల భోజనానికి సరిపోతుందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగిల్‌ ఛాయ్‌ రూ.10 రూపాయలుందని ఒక్క పూట భోజనానికి ప్రభుత్వం ఇస్తున్నది కూడా అంతేనన్నారు. మెస్‌చార్జీలు పెంచకపోవడంతో హాస్టళ్లలో నాసీరకం భోజనం వడ్డీస్తున్నారని ఇది తిని విద్యార్థులు రోగాలభారీన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెస్‌చార్జీలు, స్కాలర్‌షిప్స్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు. కాలేజీ హాస్టల్‌ విద్యార్థులకు నెలకు రూ.1050 నుంచి రూ.2వేలకు పెంచాలి. పాఠశాల, రెసిడెన్సియల్‌ విద్యార్థులకు నెలకు రూ.750 నుంచి రూ.1500లకు, విశ్వవిద్యాలయ హాస్టల్‌ విద్యార్థులకు రూ.684 నుంచి రూ.2400లకు, డేస్కాలర్‌షిప్ల్‌ను నెలకు రూ.325 నుంచి రూ.1500లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. 


అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్‌పై సీలింగ్‌నుఎత్తివేయాలని, పాకెట్‌మనీకింద రూ.500లు యూనివర్సిటీ, కాలేజీ విద్యార్థులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీసీ నాయకులు డాక్టర్‌ ర్యాగ అరుణ్‌,గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్‌, శ్రీనివాస్‌, గజేందర్‌ తదితరులున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa