రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. గుంటూరుకు చెందిన సలీం అనే వ్యక్తి.. టెర్మినల్ భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడున్న పోలీసుల చేతిలో ఉన్న గన్ను లాక్కునేందుకు అతడు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది సలీంను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టు పోలీసులకు సలీంను అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సలీంను విచారిస్తున్నారు.