ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా అధ్యక్షుడిగా శివాజీరాజా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:56 AM

మూవీ ఆర్టిస్‌‌ట్స అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా నటుడు శివాజీరాజా ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. 2019 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగను న్నారు. ఇవాళ నిర్వహించిన మా ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మా ఉపాధ్యక్షులుగా ఎంవీ బెనర్జీ, వేణుమాధవ్‌, ప్రధాన కార్యదర్శిగా నరేశ్‌ ఎన్నిక య్యారు. కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం నూతన అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ 750 మంది సభ్యుల నమ్మ కాన్ని నిలబెడతానని చెప్పారు. ప్రస్తుతం 30 మంది కళాకారులకు ఇస్తున్న పింఛనను 25 శాతం పెంచి ఇస్తామని తెలిపారు. మా 25 ఏళ్ల ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa