మోడళ్లు, సినీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులకు పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి టౌన్ షిప్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో, అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వీరు పట్టుబడ్డారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు.. వారిని ఘట్ కేసర్ పోలీసులకు అప్పగించినట్టు సమాచారం.