అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న శశికళను కలవడానికి మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలు వెళ్లారు. ఈ సందర్భంగా శశికళకు పాదాభివందనం చేసి, తమ విధేయతను చాటుకున్నారు. దాదాపు గంటసేపు విరు శశికళతో భేటీ అయ్యారు. తమిళనాడులో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు. గతంలో పార్టీ శ్రేణులంతా జయలలితకు పాదాభివందనం చేసేవారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa