ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏసీ జాకెట్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 11:54 AM

శరీరాన్ని చల్లగా ఉండే ఏసీ జాకెట్ మార్కెట్లోకి వచ్చేసింది. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ వీటిని ఆవిష్కరించారు. స్వీయ శీతలీకరణ విధానంలో రూపొందించిన ఈ జాకెట్లలో చల్లగా కావాలంటే చల్లగా, వెచ్చగా కావాలంటే వెచ్చగా రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. బయటి ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జాకెట్లు 20 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చల్లగా ఉంచగలవని మంత్రి పేర్కొన్నారు. ఖన్వా కాటన్ కు, అత్యాధునిక సాంకేతికను మేళవించి వీటిని తయారు చేసినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంచే రెండు బటన్ లు ఉంటాయి. వేడి కోసం ఎర్రటి బటన్, చల్లదనం కోసం ఆకుపచ్చ బటన్ నొక్కితే సరిపోతుంది.  ఈ జాకెట్ లో బ్యాటరీతో నడిచే కూల్, హాట్ ఎయిర్ ఫ్యాన్స్  ఏర్పాటు చేశారు.క్లైమేట్ గేర్ టెక్నాలజీని రూపొందిచడం ద్వారా ఓ ఎంఐటీ గ్రాడ్యుయేట్ దీని తయారీలో సహకరించాడు. త్వరలోనే ఈ జాకెట్లు మార్కెట్లోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు. ఫుల్ స్లీవ్ జాకెట్ రూ. 25 వేలుగా ఉండగా, హాఫ్ జాకెట్ రూ. 18 వేల వరకూ ఉంటుందని సమాచారం.  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ జాకెట్ తయారీకి సహకరించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa