ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత గ్యాస్‌కు ఆధార్‌ తప్పనిసరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 12:52 AM

-లింకు పెట్టిన కేంద్రం  
-ఆధార్‌ ఉంటేనే పేదలకు ఇకపై వంట గ్యాస్‌ సరఫరా
-గత సంవత్సరం మేలో ప్రారంభమైన పేదలకు ఉచిత గ్యాస్‌ పథకం
-ఇప్పటివరకూ ఆధార్‌ లేకున్నా సిలిండర్ల సరఫరా  
-మే 31లోగా ఆధార్‌ ఇవ్వకుంటే గ్యాస్‌ నిలిపివేత  
-అందుబాటులోకి వచ్చిన ఆధార్‌పే
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజనా కింద పేద మహిళలకు అందజేసే ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు ఆధార్‌ ను తప్పనసరిగా జతచేయాలని పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం మే 31న ఉత్తరప్రదేశ్‌ లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్‌ పంపిణీ చేస్తోంది. గతంలో గ్యాస్‌ సబ్సిడీ సిలిండర్లకు మాత్రమే ఆధార్‌ గుర్తింపు తప్పనిసరి చేశారు. ఇప్పుడు దానిని ఉచిత సిలిండర్లకు కూడా వర్తింప చేస్తున్నట్లు తెలిపారు.


ఆధార్‌ కార్డులు లేని వారు మే 31వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్‌ కు దరఖాస్తు చేసుకున్నవారు తాము దరఖాస్తు చేసుకున్న కాపీతో పాటు బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఫొటోగ్రాఫ్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్‌‌డ, పాన్‌ నెంబర్‌, పాస్‌పోర్‌‌ట, డ్రెవింగ్‌ లైసెన్‌‌స, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, ఫొటో ఉన్న సర్టిఫికెట్‌పై గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకం చేసిన కాపీలను జతచేయాలని సూచించారు. 


 


ఆధార్‌ పేతో ఇక వినియోగదారుడు తన వద్ద స్మార్‌‌ట ఫోన్‌ లేకున్నా బిల్లు చెల్లించవచ్చు: దేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర సర్కారు ఈ రోజు మరో యాప్ను విడుదల చేసింది. 'ఆధార్‌ పే' పేరుతో లాంచ్‌ అయిన ఈ యాప్తో నగదురహిత లావాదేవీల్లో అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చు. అంతేకాదు, కస్టమర్ల వద్ద మొబైల్‌ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇందు కోసం బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ నంబర్ను అనుసంధానించాల్సి ఉంటుంది. వ్యాపారి, దుకాణం దారుడి వద్ద ఉన్న ఆధార్‌ పే యాప్‌ లో వినియోగదారుడు వేలి ముద్ర ƒ(బయోమెట్రిక్‌ పధ్ధతి) ఇచ్చి బిల్లులు చెల్లించు కోవచ్చు. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ యాప్‌ ను వినియోగించడం వల్ల క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుల కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తం ఆదా అవుతుంది. ఈ యాప్‌ను వ్యాపారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవడంతో పాటు దానితో పాటు బయోమెట్రిక్‌ స్కానర్‌ యాప్లను కూడా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఒకదానితో మరొకదాన్ని అనుసంధానించు కోవాలి. తమ వద్దకు వచ్చిన కస్టమర్ల వద్ద ఆధార్‌ నెంబరును తీసుకొని యాప్లో టైప్‌ చేయాలి. అనంతరం సదరు కస్టమర్‌ వేలిముద్ర తీసుకొని బిల్లుని టైపు చేయాలి. దీంతో ఆటోమెటిక్గా వినియోగదారుడి బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్‌ అవుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa