ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 01:16 AM

  -మహిళలను గౌరవించాలి -సమానత్వం కల్పించాలి
  -మహిళలపై వివక్ష తగదు-సృష్టికి మూలం స్త్రీ
  -ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  -ముఖ్య అతిథిగా హాజరైన సంఘం గౌరవాధ్యక్షురాలు శిద్ధా లక్ష్మీ పద్మావతి

  దొనకొండ, మేజర్‌న్యూస్‌ : ప్రతీ ఒక్కరు మహిళలను గౌరవించి, అన్నీ రంగాల్లో సమానత్వం కల్పించే విధంగా ప్రోత్సహిం చాలి రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం గౌరవాధ్యక్షురాలు శిద్ధా లక్ష్మి పద్మావతి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్స వం సందర్బంగా దొనకొండలోని ఆంజనేయ స్వామి దేవాల యంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలకు సమానత్వం కల్పించాల న్నారు. అప్యాయ లతో కుటుంభం సుఖమయమన్నారు. కొత్తగా ఇంటికి వచ్చిన కోడల్ని మనం అర్ధం చేసుకుని సొంత కూతురు మాదిరిగా ఆదరించా లని ఈ సందర్బంగా ఆమె అన్నారు.  ఆడపిల్లలను చిన్న చూపు చూడకూడదని, ఎవరైనా మహిళలను ఏడిపిస్తే వారి ప్రవర్తన తల్లిదండ్రులకు  తెలుస్తుందని వారే వారికి బుద్ది చెప్పాలని అన్నారు.  వృద్ధులను  వృద్ధాశ్రమంలో వదిలి పెట్టకూడ దని, తమకు ఎంతో భవిష్యత్తు ఇచ్చిన వారిని వదిలి పెడితే రేపు మనకు అలాగే జరుగుతుందని అన్నారు.   రాజకీయాలతో సహా అన్ని రంగాల్లో  మహిళలు రాణిస్తున్నారని వారికి తగిన అవకాశాలు ఇచ్చి  బలపరిస్తే మరెన్నో విజయాలు సాధిస్తారని అన్నారు. అనంతరం లక్ష్మీపద్మావతిని ఘనంగా సత్కరించారు.
   ఈ కార్యక్రమంలో ఎంపిపి  నాగులపాటి గాలెమ్మ,  దొనకొండ సర్పంచ్‌  అనంతలక్ష్మీ, వెంకటాపురం సర్పంచ్‌ రాజ్యలక్ష్మి, మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ వక్కలగడ్డ రాధిక, పెద్ద సంఖ్యలో మహిళలు , తెదేపా నాయకులు పాల్గొన్నారు.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa