ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయలలిత అండతో రెచ్చిపోయిన మహిళా ఐఏఎస్‌ అధికారికి మంత్రి ఝలక్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 01:27 AM

చెనై్న : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆంటీ అని పిలవగలిగేంత చనువు ఉన్న ఐఏఎస్‌ అధికారి సబితకు విద్యా శా మంత్రి సెంగొటయ్యన్‌ షాక్‌ ఇచ్చారు. జయ అండతో ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ఆరేళ్ల పాటు అధికారం చలాయించిన సబితపై ఎట్టకేలకు బదలీ వేటు పడింది. ముఖ్యమంత్రి పళనిస్వామి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా సోమవారం 17 మంది ఐఏఎస్‌లను బదలీ చేశారు. ఆ 17 మందిలో పాఠశాల విద్యా శాఖ కార్యదర్శిగా ఉన్న సబితను సిమెంట్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ బదలీ చేశారు. విద్యా శాఖను ఆరేళ్ల పాటు తన గుప్పిట్లో పెట్టు కున్న సబితపై వేటు పడడంతో మిగతా ఐఏఎస్‌ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జయకు అత్యంత సన్నిహితురాలైన సబితను పళని ప్రభుత్వం కదిపే అవకాశం లేదని అందరూ భావించారు. ఐఏఎస్‌ అధికారులంతా జయ ను మేడమ్‌ అని పిలిస్తే సబిత మాత్రం ఆంటీ అని పిలిచేవారు. జయ పాల్గొనే కార్యక్రమాల్లో ఆమె హల్‌చల్‌ చేసేవారు. ఒకానొక దశలో జయలలితకు ప్రత్యేక కార్యదర్శిగా సబిత నియమితులవుతారని భావించారు. విద్యా శా మంత్రులు మారినా ఆరేళ్ల పాటు సబిత అదే కుర్చీని అంటిపెట్టుకుని ఉండడం గమనార్హం. ఏ ఒక్క మంత్రీ ఆమె అధికారాల్లో వేలు పెట్టడానికి సాహసించలే కపోయారు. అయితే, పళనిస్వామి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పార్టీ సీని యర్‌ నేత సెంగొట్టయ్యన్‌ విద్యా శా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో సబిత అధికారాలకు బ్రేక్‌ పడింది. ఒకానొక దశలో మంత్రికి, సబితకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌పై మంత్రి పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమెపై బదలీ వేటు పడింది. సబిత బదలీతో ఇతర ఐఏఎస్‌ అధికారులు లోలోపల ఆనందిస్తున్నారు. అయితే, విద్యా శాఖకు తప్పిన గండం ఇప్పుడు సిమెంట్‌ శాఖకు చుట్టుకుందని పలువురు జోకులు వేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa