ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నో కన్వర్షన్‌ నో లే ఔట్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 01:51 AM

-పంట పొలాలపై రియల్‌ పంజా  
-అనుమతులు లేకుండానే వెంచర్లు
-ప్రభుత్వ నిబంధనలు గాలికి  
-లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
-పట్టించుకోని అధికారులు  
-పచ్చని పొలాలను ప్లాట్లుగా మారుస్తున్న వైనం

కరీంనగర్‌-సూర్యప్రత్యేకప్రతినిధి : ఎలాంటి అనుమతులు లేకుండా యధెచ్చగా పంట పొలాలను ప్లాట్లుగా మారుస్తు అమ్ముకుంటు లక్షల్లో సొమ్మును అక్రమార్కులు జేబుల్లో వేసుకుంటున్నారు.లే అవుట్‌, కన్వర్షన్‌ లేకుండానే ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలో వేలాది ఎకరాలను వెంచర్లుగా చేసు కుంటు అమ్ముకుంటు సొమ్ము చేసుకున్న అధికారులు పట్టించుకోక పోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రంగు రంగుల వోచర్లతో అమయా కులను రియల్టర్లు బురిడి కొట్టిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలో జాతీయ రహదారుల పక్కన, ప్రధాన పట్టణాలలో, పట్టణ శివారు గ్రామాల్లో సైతం వేలాది వెంచర్లు వెలుస్తునే ఉన్నాయి. గ్రామాల మధ్య ఉన్న పంట పొలాలపై రియల్‌ వ్యాపారులు కన్నెసి రైతన్నలను మోసం చేసి తక్కువ ధరలకు భూములను కొనుగోలు చేసి, పంట భూములను ఎలాంటి నిబంధనలు లేకుండా ప్లాట్లుగా మార్చుతున్నారు. కొందరు కొంత భూములను కొనుగోలు చేసి వాటి పక్కన గల ప్రభుత్వ భూములను కూడా అమ్ముకుంటున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. పంట పొలాలను ప్లాట్లుగా మార్చడానికి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రియల్టర్లు వెంచర్లు చేస్తున్నారు. దీనితో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులు పడడమే కాకుండాప్రభుత్వానికి రావల్సిన ఆధాయానికి గండి కొడుతుంది. వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చి ప్లాట్లు తయారు చేయాలంటే రెవెన్యూశాఖ నుండి అనుమతులు తీసుకుని  వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి ఇందు కు రెవెన్యూశాఖకు కన్వర్షన్‌ ఫీజు చెల్లించాలి అనంతరం లే అవుట్‌ తయారు చేసి దానికి సంబంధించిన నగరపాలక, పురపాలక, నగర పంచాయితి, గ్రామ పంచాయితిల అనుమతులు పొందాలి. కాని ఉమ్మడి జిల్లాలో అటువంటి నిబంధనలు ఏమి పాటించకుండా వెంచర్లు చేసి లక్షలు దండుకుంటున్నారు. వెంచర్‌లలో 30అడుగుల దారి ఉండాల్సి ఉండగా ఎంతో కొంత దారిగా చూపిస్తు ప్లాట్లను అమ్ముకుంటున్నారు. రైతుల వద్ద నుంచి భూములు కొను గోలు చేసినా వ్యాపారులు ఇంత వరకు రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోకుండా ఆ భూమిని అమ్మిన రైతు లకు మాత్రమే ప్లాట్ల కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌ ను చేస్తున్నారు. దీనితో భవిష్యత్తులో అక్కడ కొనుగోలు చేసినా వారు ఏదన్న నిర్మాణాలు చేపడితే ఎలాంటి అనుమతులు రావు. పైగా పంచాయితిలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కొనుగోలు చేసినా ప్లాట్లలో ఇండ్ల నిర్మాణాల కోసం అనుమతులు తీసుకోవాలంటే ప్రస్తుతం ప్లాట్ల యాజమా నులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంచర్లు లే అవుట్‌ లేక పోవడం, వ్యవసాయ భూములను కన్వర్షన్‌ చేసుకోక పోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక వెంచర్‌కు, ఇంకొ వెంచర్‌కు  సంబంధం  లేకుండా రోడ్లను ఏర్పాటు చేయడంతో రోడ్ల సమస్య తయారవుతుంది. ఇండ్ల నిర్మాణం కోసం అనుమ తులు తీసుకోవాలంటే సంబంధిత అధికారులు లే అవుట్‌ ఇతర అనుమతుల పత్రాలు తప్పని సరిగా కావాలంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత…  డిసెంబర్‌ 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ క్రింద డిడిలు తీసిన వారికి అనుమతులు ఇస్తున్నారు. ప్రస్తుతం ప్లాట్లు కొనుగోలు చేసినవారికి అనుమతులు వచ్చే దాఖాలాలు కనిపించడం లేదు. రియల్టర్లు చేసిన మోసాలకు అనేక మంది సామాన్యులు బలైపోతున్నారు. ఇకనైన ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, సంబంధిత అధికారులు అనుమతులు లేని వెంచర్లపై దృష్టి సారించి వాటిని ఏర్పాటు చేసిన రియల్టర్ల పై చర్యలు తీసుకోని ప్రజలను కాపాడ వల్సిన భాధ్యత ఎంతైన ఉంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa