ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో మరోసారి అలజడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 01:37 AM

పన్నీర్‌ సెల్వం దీక్ష ప్రారంభం
జయలలిత మరణంపై ప్రభుత్వం ఇచ్చిన
నివేదిక తప్పుల తడక
కోర్టును ఆశ్రయిస్తా: పన్నీరు సెల్వం

చెనై్న : అమ్మ జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం బుధవారం దీక్ష ప్రారంభించారు. చెనై్నలోని రాజరత్నం స్టేడియంలో జరుగుతున్న ఈ దీక్షలో పన్నీర్‌ సెల్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటున్నారు. దీక్ష ప్రాంగణానికి భారీ ఎత్తున పన్నీర్‌ సెల్వం మద్దతుదారులు, ప్రజలు చేరుకున్నారు. జయలలిత మృతిపై పలువురు నేతలు ఇప్పటికే ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు అందించిన చికిత్సపై గత నెల అపోలో యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. రెండు రోజుల క్రితమే తమిళనాడు సర్కార్‌ కూడా వివరణ ఇచ్చింది. అయితే, వారు ఇచ్చిన సమాధానాలు ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జయలలిత మరణంపై సీబీఐతో విచారణ జరిపించడానికి ఆదేశాలు వచ్చే వరకు తాము దీక్షను విరమించబోమని పన్నీర్‌ సెల్వం చెబుతుండడంతో తమిళనాడులో మరోసారి అలజడి రేగుతోంది.


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక తప్పుల తడకగా ఉందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆరోపించారు. చెనై్నలో జయలలిత మృతిపై చేపట్టిన నిరాహార దీక్ష ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయలలిత మృతిపై మద్రాసు హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. అపోలో ఆసుపత్రి విడుదల చేసిన నివేదికకు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికకు పొంతన లేదని ఆయన చెప్పారు. తామంతో ఎంతగానే ప్రేమించే జయలలిత మృతి వెనుక వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. తమ అనుమానాలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆమె మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వారసత్వ రాజకీయాలను జయలలిత ఏనాడూ అపేక్షించలేదని ఆయన చెప్పారు. అన్నా డీఎంకే పార్టీ ఒక కుటుంబం చేతిలో బందీ కాకుండా ఉండేందుకు తాము పోరాడుతున్నామని ఆయన తెలిపారు. ఈ పోరాటంలో ఎంత దూరమైనా వెళతామని ఆయన చెప్పారు. కాగా, తమిళనాడు వ్యాప్తంగా జయలలిత మృతిపై పన్నీరు సెల్వం మద్దతుదారులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa