న్యూఢిల్లీ : మహిళా సాధికారతపై నిత్యమూ మాట్లాడుతూ ఉండే కేంద్ర మంత్రి మేనకా గాంధీ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. హాస్టళ్లలో ఉండే అమ్మాయిలు దారి తప్పకుండా `లక్ష్మణ రేఖ' ఉండాల్సిందేనని, హాస్టళ్లలో వారిపై రాత్రిళ్లు కర్ఫూ్య వంటి ఆంక్షలు ఉంచాలని, అది వారి రక్షణ కోసమేనని, ఇదే తరహా ఆంక్షలు అబ్బాయిలకు అవసరం లేదని ఆమె అన్నారు. `తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లకు పంపి చదివించడానికి అంగీకరించారంటే, వారి రక్షణపై నమ్మకం ఉంచినట్టే. ముఖ్యంగా 16, 17 ఏళ్ల అమ్మాయిల్లో వచ్చే శారీరక మార్పులు చాలా సవాళ్లతో కూడుకున్నవి. అందువల్ల వారి రక్షణ అత్యంత ముఖ్యం' అని మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. అమ్మాయిలు, అబ్బాయిలను వేరు చూస్తూ, ప్రతి విషయంలోనూ అవధులు ఉండాలని, రాత్రిళ్లు లైబ్రరీలకు వెళ్లే విషయంలోనూ, రెండు రోజులు కేవలం అబ్బాయిలకు, రెండు రోజులు కేవలం అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. మేనకా గాంధీ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa