-మహిళా దినోత్సవం వేడుకల్లో మంత్రి
-మహిళలను సన్మానించిన మంత్రి
-రూ. 20.30 కోట్ల బ్యాంకు లింకేజీ అందజేత
-రూ. 6.80 కోట్ల రాయితీ పంపిణీ
సూర్యాపేటప్రతినిధి, మేజర్‌న్యూస్: మహిళాభ్యున్నతిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖా మాత్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, సామాజిక, రాజకీయ, వివిధ రంగాల్లో మహిళలు రాణిస్తున్నందున ఘనంగా సన్మానించారు. మహిళా సంఘాలకు రూ.20.30 కోట్ల, బ్యాంకు లింకేజీ 101 ఔత్సాహిక ఎస్సీ,ఎస్టీ మహిళా పారిశ్రామిక యజ మానులకు రూ.6.87 కోట్లను మంత్రి పంపిణీ చేశారు. కుటుంబంలో మహిళ ల పాత్ర చాలా కీలకమైందని ప్రశంసించారు.
ఆర్థిక వ్యవహారాల్లో.. చురుగ్గా ఉన్న కుటుంబాలు మాత్రమే ఆర్థికస్వా లంభన సాధిస్తాయని చెప్పారు. మహిళలు కుటుంబ అవసరాల కోసం పొదుపు చేస్తారని.. ఆ పొదుపు అభివృద్ధికి చోధకశక్తిగా మారుతుందన్నారు. పూర్వ కాలంలో మన సమాజంలో మాతృ స్వామ్య వ్యవస్థ ఉండేదని.. తదుపరి జరిగిన పరిణామ క్రమంలో నేటి పితృ స్వామ్య వ్యవస్థగా మారిందని మంత్రి అభిప్రాయపడ్డారు. నేటి వ్యవస్థలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు.. వివక్షను రూపు మాపేందుకు కేసీఆర్ ప్రత్యేక చొరవ చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే మహిళల రక్షణకు సీసీ టీవీలు, షీటీం, స్నేహిత టీంలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో కలెక్టర్ సురేంద్రమోహన్, ఎస్పీ పరిమళహననూతన్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికాప్రకాష్, డీఈవో వెంకటనర్సమ్మ, డీఎస్‌వో అనురాధ, ఆర్డీవో, డీఆర్‌డీవో పీడీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డిని అధికారులు సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa