ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమతో మీ కార్తీక్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 02:24 AM

జీవితంలో కెరీర్‌ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్‌. రమణశ్రీ ఆర్ట్స బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్‌ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. కార్తికేయ, సిమ్రత్‌, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పఎథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్‌, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు. చిత్ర షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్‌‌ట ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రేమతో మీ కార్తీక్‌ ఫస్‌‌ట లుక్‌ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... ప్రేమతో మీ కార్తీక్‌ చిత్రాన్ని దర్శకుడు రిషి అందమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. కెరీర్‌, ప్రేమ, కుటుంబాల మధ్య ఉండే సంబంధాల్ని చక్కగా చూపించారు. ఈ చిత్రంతో మంచి దర్శకుల లిస్టులో రిషి చేరతాడని భావిస్తున్నాం.  భలే భలే మగాడివోయ్‌ తర్వాత మురళీ శర్మ అంత అద్భుతమైన పెర్‌ ఫార్మెన్‌‌స చేశారు. గొల్లపూడి మారుతి రావు గారు చాలా కాలం తర్వాత ఒక ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేశారు. కేరళ లోని వాగమన్‌, ఇడుక్కి ప్రాంతాల్లో కూర్‌‌ల లో ఇప్పటివరకు ఎవ్వరూ షూట్‌ చేయని అందమైన లొకే,న్‌‌స లో షూట్‌ చేయడం జరిగింది. మలయాళంలో సక్సెస్‌ ఫుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ షాన్‌ రెహమాన్‌ అందించిన పాటలు హైలైట్‌ గా నిలుస్తాయి. సాయి ప్రకాష్‌ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ మరో హైలైట్‌ గా ఉంటుంది. కేరళ, కూర్‌‌గ, గోవా, హైదరాబాద్‌ లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. చిత్ర షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్‌‌ట ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.
నటీనటులు - కార్తికేయ, సిమ్రత్‌, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పఎథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్‌, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు.
సాంకేతిక నిపుణులుసంగీతం - షాన్‌ రెహమాన్‌ సినిమాటోగ్రఫి - సాయి ప్రకాష్‌ ఉమ్మడి సింగు ఎడిటర్‌ - మధు ఆర్‌‌ట - హరి వర్మ, మేకప్‌ - నాగు తాడల కాస్టూ్యమ్‌‌స - నాగు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa