మొబైల్‌ను ఉపయోగించి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేందుకు వీలు కల్పించే వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ఇంటి నుంచి పనిచేయడానికి ఉద్యోగులకు వీలు కల్పిస్తూ ఎస్‌బీఐ బోర్డు ఇటీవలే ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మొబైల్ కంప్యూటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అందరి ఉద్యోగుల మొబైళ్లను కేంద్రీకృత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తారు. డాటా, అప్లికేషన్లకు భద్రత పరంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం, సేవలను ప్రత్యేక వ్యవస్థ(ఎమ్‌ఐఎస్) ద్వారా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. దీని వల్ల ఉద్యోగులు సత్వరం ఏదైనా పనిచేయాల్సి వచ్చినపుడు ఇంటి నుంచి పని ప్రదేశానికి పరుగులు పెట్టకుండా ఇంటి నుంచే ఆ పనిని పూర్తి చేసేందుకు వీలవుతుందని బ్యాంకు తెలిపింది. భవిష్యత్‌లో మార్కెటింగ్, సీఆర్‌ఎమ్, సోషియల్ మీడియా మేనేజ్‌మెంట్, సెటిల్‌మెంట్, ఫిర్యాదు నిర్వహణ తదితర పనులకూ ఇంటి నుంచే పనిచేసేలా వీలు కల్పించాలని బ్యాంకు భావిస్తోంది. తద్వారా ఉద్యోగి ఉత్పాదకతను ఎన్నో రెట్లు పెంచుకోవచ్చని అంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa