నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మాణంలో గోపాల గోపాల ఫేం డాలీ తెరకెక్కిస్తున్న కాటమరాయుడు చిత్రాన్ని మార్చి 24న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. సాంగ్స్ కోసం ఇటలీ వెళ్ళిన టీం మరో నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి రానున్నట్టు టాక్. మార్చి 18న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని భావిస్తున్న టీం ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తూ మూవీపై మంచి హైప్ తీసుకొస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన చిత్రంలోని తొలి సాంగ్ మిర మిర మీసం పాటని రీసెంట్ గా విడుదల చేయగా, ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రోజు సాయంత్రం 4గం.లకు లాగే లాగే అనే సెకండ్ సింగిల్ సాంగ్ ని విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa