ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల అక్రమాలు పతాక స్థాయికి చేరాయి. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపు కోసం విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ గద్వాలలో ఆ పార్టీ కార్యకర్తలు దొరికిపోయారు. గద్వాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై స్థానిక టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa