న్యూఢిల్లీ: పార్లమెంటులో రెండో విడత బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సారి సమావేశాల్లో ప్రతిపక్షాలు రామ్‌జాస్ కాలేజీ ఘర్షణలు మొదలు అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేష దాడుల వరకు ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా పార్లమెంటు వెలుపల ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో జీఎస్టీపై ముందడుగు పడుతుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు. నిర్మాత్మకమైన చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా పార్లమెంటు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత కుమార్ విజ్ఞప్తి చేశారు.ఆర్థిక, వినియోగ, ప్రసూతి బిల్లులపై పార్లమెంటులో చర్చ జరగనున్నట్టు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa