హైదరాబాద్: రోజు రోజుకీ సెలబ్రెటీల సోషల్ మీడియా ఎక్కౌంట్స్ హ్యాక్ అయ్యే కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మళయాళి నటి మడోన్నా సెబాస్టియన్ ట్విట్టర్ ఖాతా హ్యాకైంది. అయితే అదృష్టవశాత్తూ ఏ విధమైన వివాదాస్పదమైన పోస్ట్ లు పెట్టలేదు. ఈ విషయమై మడోన్నా సైబర్ క్రైమ్ కేసు రిజిస్టర్ చేసింది. ఇక ఈ విషయాన్ని మడోన్నా ఫేస్ బుక్ ద్వారా అధికారికంగా వెల్లడిస్తూ తన ఎకౌంట్ నుంచి ఎలాంటి పోస్టులు వచ్చినా స్పందించవద్దని అభిమానులను హెచ్చరించింది.అంతేకాకుండా ట్విటర్ నుంచి కూడా ఎలాంటి ట్వీట్స్ వచ్చినా తాను చెప్పేవరకు ఎలాంటి రిప్లై ఇవ్వొద్దని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa