పోర్ట్‌బ్లెయిర్: మన దేశంలో ఉన్న ఏకైక అగ్నిపర్వతం గత జనవరి నుంచి మళ్లీ లావాను వెదజల్లుతున్న విషయం తెలిసిందే. పోర్ట్‌బ్లెయిర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్నిపర్వతం పేలుడుపై కోస్ట్‌గార్డ్ నిఘా ఏర్పాటు చేసింది. 1787లో తొలిసారి పేలిన ఈ అగ్నిపర్వతం పదేళ్ల కిందట ఒకసారి క్రియాశీలకంగా మారింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇది లావాను వెదజల్లుతున్నది. బారెన్ దీవిలో ఉన్న ఈ అగ్నిపర్వతం పేలుడును గత జనవరిలో ఓ రీసెర్చ్ షిప్ గుర్తించింది. అయితే అది ప్రమాదకరంగా కనిపిండచంతో ఆ దీవిపైకి వెళ్లలేదు. పగటి వేళలో కేవలం బూడిద మేఘాలు మాత్రమే కనిపించాయి. కానీ చీకటి పడగానే ఎర్రటి లావాను బయటకు చిమ్మడం కనిపించింది అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను కోస్ట్‌గార్డ్ రిలీజ్ చేసింది. అండమాన్ నికోబార్స్‌లో ఉన్న ఈ అగ్నిపర్వతం భారీగా లావాను, ఆవిరిని, పొగను చిమ్ముతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇందులోభాగంగానే ఓ నైట్‌విజన్ కెమెరాతో వీడియో చిత్రీకరించింది. అయితే ఇందులో రికార్డు చేసే సౌకర్యం లేకపోవడంతో ముందు ఓ మొబైల్ ఫోన్ ఉంచి వీడియోను రికార్డు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa