ఢిల్లీ: నేడు ఢిల్లీలో టెక్నాలజీ, ఇన్నోవేషన్స్‌పై జరిగిన ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇండియా-2017 సదస్సులో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మెరుగైన సమాజం కొరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణహిత డిజిటల్ టెక్నాలజీలో భాగంగా ఆధునిక ఈ-కామర్స్, ఈ-హెల్త్, ఈ-ఎడ్యూకేషన్ రంగాలపై ప్రధానంగా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథలో భాగంగా రానున్న 18 నెలల కాలంలో ఇంటింటికి మంచినీరుతో పాటు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కుటుంబాలకు త్రాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందుకోసం 1,20,000 కిలోమీటర్ల పైప్‌లైన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాన్నే సానుకూలంగా మలచుకుంటూ ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను వేయాలని నిర్ణయించామన్నారు. డిజిటల్ ఎకో సిస్టమ్‌లో డిజిటల్ అవస్థాపన, డిజిటల్ అక్షరాస్యత ప్రధానమైందన్నారు. కాగా సామాజిక ఉపయోగం లేని టెక్నాలజీ నిరర్థకమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ-హబ్, టీ-బ్రిడ్జ్ వంటి కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. భారత్‌లో 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారేనన్నారు. యువశక్తిని వినియోగించుకునేలా సైబర్ సెక్యూరిటీ, మల్టీమీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, యానిమేషన్, గేమింగ్, డిజైనింగ్ తదితర రంగాల్లో ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వాలు చొరవచూపాలని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa