డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం 'కాట్రు వేళయిదై'. తెలుగులో ఇదే సినిమా 'చెలియా' టైటిల్‌తో విడుదలవుతోంది. కాగా ఈ సినిమాకు చెందిన అఫిషియల్ ట్రైలర్‌ను ఇవాళ ఫేస్‌బుక్ లో విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్, మణిరత్నంలు ఫేస్‌బుక్‌లో లైవ్‌గా కనిపించి ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. ఫేస్‌బుక్‌లో లైవ్ అయిన ఆ వీడియోలో సరిగ్గా 3 నిమిషాల 39 సెకన్ల వద్ద వీక్షకులు ట్రైలర్‌ను చూడవచ్చు. ముందుగా తమిళంలో ఈ ట్రైలర్ ప్రారంభమై ఆ తరువాత తెలుగులో దర్శనమిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa