మేజర్‌న్యూస్ తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్ప టికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 10 వేల ఉద్యోగాలు భర్తీ మాత్రమే పూర్తయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శిం చారు. గురువారం వరంగల్‌లో ఏర్పాటుచేసిన సమావే శంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధికారం లోకి వస్తే లక్షా ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తా మన్న హమీతో అధికారంలకి వచ్చిన కెసిఆర్ ఇప్పు డు పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో నిరుద్యోగ యువతీ యువ కులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగాలలో భర్తీ కోసం నియమ నిబంధనలు అడ్డగోలుగా పెట్టడం సరికాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా టిఆర్‌ఎస్ ప్రజలలో అపహా స్యం పాలవుతుందని విమర్శించారు. ఎంపిలకు జాతీయ పార్టీ నాయకులకు సిఎం కెసిఆర్ కనీసం అపాయింట్‌మెంట్ కూడ ఇవ్వడం లేదన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ పేరును మారిస్తే ఊరుకోమని హెచ్చరిం చారు. టిఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న దోపిడీలపై ప్రజలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహింస్తామన్నారు. నేతలు శ్రీనివాసరావు, కర్ణాకర్, బిక్షపతి తదితరు లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa